Categories: Uncategorized

‘సైంధవ్’ నుంచి మానస్‌గా ఆర్య పరిచయం

థండర్ లాంటి ఫెరోషియస్ మిషన్, మెరుపు లాంటి పవర్-  విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్  ‘సైంధవ్’ నుంచి మానస్‌గా ఆర్య పరిచయం

విక్టరీ వెంకటేష్‌ 75 మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్‌’ ని మెమరబుల్ గా చేయడానికి భారీ తారాగణం ,అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హిట్‌వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 8 మంది కీలక నటీనటుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇప్పటివరకు 7 పాత్రలను పరిచయం చేశారు. ఈరోజు సినిమాలోని మరో కీలక పాత్రను రిలీవ్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ ఆర్య ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను మానస్‌గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫార్మల్ దుస్తుల్లో స్లిక్, స్టైలిష్ లుక్‌తో చేతిలో మెషిన్ గన్‌తో ఫెరోషియస్ గా   కనిపిస్తున్నారు ఆర్య.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ నిమాలోని ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక  గ్లింప్స్ విడుదల చేశారు. వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ వీడియోలో కనిపించారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

3 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

4 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago