“మాయలేడి” కొత్త తరహా మ్యూజికల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్, ఆడియెన్స్ మా సినిమాను ఇష్టపడతారని నమ్ముతున్నాం – హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే..!

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. “మాయలేడి” సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే.

  • మాయలేడి టైటిల్ కథకు యాప్ట్ గా ఉంటుంది. హీరోయిన్ కు కథలో ఎడ్జ్ ఉంటుంది. అయితే ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ కాదు. కథకు బాగుంది కాబట్టే మాయలేడి టైటిల్ పెట్టాం. నా క్యారెక్టర్ బేస్ చేసుకుని కూడా టైటిల్ పెట్టుకోవచ్చు. సినిమా చూశాక మీరు కూడా ఈ టైటిల్ కరెక్ట్ అని అనుకుంటారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. కథలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇంటర్వెల్ 30 నిమిషాల ముందు కథలో సాలిడ్ పాయింట్ వస్తుంది. ఇంటర్వెల్ కు మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చూపిస్తున్నాం. అక్కడికే మనకు సినిమా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సాధారణంగా మొదలయ్యే కథ ఒక అసాధారణ స్థాయికి వెళ్లి మళ్లీ నార్మల్ గా ల్యాండ్ అవుతుంది.
  • నాకు రొమాంటిక్, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇష్టం. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ తో థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన జానర్ కూడా అదే. ప్రేమించుకుందాం రా, బొమ్మరిల్లు, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాలను మా కుటుంబ సభ్యులతో కలిసి చూస్తూ ఆనందించాం. నేను కూడా అలాంటి మూవీస్ నే ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. అయితే ప్రతి కథలో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నా. పేకమేడలు, ఎవరికీ చెప్పొద్దు చిత్రాల్లో మీరు ఆ కొత్తదనాన్ని ఆదరించారు. ఈ కథలోనూ ఆ వేరియేషన్ ఉంటూనే కమర్షియల్ గా సాగుతుంది.
  • ప్రస్తుతం బ్లడ్ బాత్ సినిమాలు యాక్షన్ మూవీస్ బాగా వస్తున్నాయి. నా ముందు హీరోగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నాకు నచ్చిన ఇలాంటి సినిమాలు చేయడం లేదా ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం. హీరోగా కమర్షియల్ సక్సెస్ వస్తే అప్పుడప్పుడు అలాంటి సినిమాలు చేసినా తప్పులేదు. నాకు యాక్షన్ డ్రామాలు ఇష్టం కూడా. నేను జితేందర్ రెడ్డి సినిమా చేసినప్పుడు నా వయసుకు మించిన మూవీ అన్నారు. సక్సెస్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోగాలు అయినా చేయొచ్చు. ముందు నాకు హీరోగా మంచి గుర్తింపు రావాలి. నా సినిమాలకు బిజినెస్ జరగాలి. ఒక బ్లాక్ బస్టర్ కొడితేనే అవన్నీ సాధ్యం. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మాయలేడి అలాంటి సక్సెస్ నాకు అందిస్తుందని నమ్ముతున్నా.
  • వేరే ప్రొడక్షన్ కంపెనీస్ లో సినిమాలు చేయొచ్చు. కానీ టైమ్ ఎక్కువ పడుతుంది. వాళ్లకు కథ నచ్చినా ట్రెండింగ్ లో ఉన్న కథ కావాలని అంటారు. లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయ్యాక అందరూ అలాంటి కథ చేద్దామని అడిగారు. అందరూ అవే చేస్తే ఆ జానర్ కూడా రొటీన్ అవుతుంది. బాహుబలిలో సేతుపతి పాత్ర నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాకే చాలా టైమ్ పట్టింది. నేను ఇంకా ఆలస్యం చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే హీరోగా కొనసాగేందుకే మొగ్గు చూపిస్తున్నా. రీసెంట్ గా గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబో మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను.
  • నేనే ప్రొడ్యూసర్ కాబట్టి కథ పరంగా జాగ్రత్తలు తీసుకుంటా. ప్రొడక్షన్ వైజ్ ఎంత వీలైతే అంత తక్కువలో క్వాలిటీలో రాజీ పడకుండా మూవీ చేయాలనుకుంటా. మార్కెటింగ్ లోనూ దగ్గరుండి చూసుకుంటా. మా సినిమాకు కొన్ని బిజినెస్ డీల్స్ జరిగాయి. ఇండస్ట్రీ పరంగా చూస్తే థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ గతంలో కంటే చాలా తగ్గిపోయింది. నా గత చిత్రాలకు పెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయి. అవి సేఫ్ ప్రాజెక్ట్స్ గా చెప్పుకోవచ్చు.
  • హీరోయిన్ మధుమిత ఈ చిత్రంలో రూప, ఆశ అనే రెండు క్యారెక్టర్స్ లో నటించింది. ఆమె చాలా ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేసింది. నాకు రూప క్యారెక్టర్ ఇష్టం. ట్రైలర్ ఆమె క్యారెక్టర్ మీరు చూసింది చాలా తక్కువ. థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆశ క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ మా సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తుంది. ఆయన కథ విన్న వెంటనే నచ్చి సినిమాకు వర్క్ స్టార్ట్ చేద్దామన్నారు.
  • నెల రోజుల ముందు నుంచీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మా సినిమాకు థియేటర్స్ బాగానే దొరికాయి. ఏపీ, తెలంగాణలో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మా సినిమాను భారీ ఎత్తున కాకుండా కాంపాక్ట్ గా రిలీజ్ చేస్తున్నాం. యూఎస్ లో కూడా తెలుగువాళ్లు ఎక్కువ ఎక్కడ ఉన్నారో చూసి ఆ లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈ వారం 13 సినిమాలు రావాల్సిఉంది. ఇప్పుడు కొన్ని వెనక్కి తగ్గాయి. దాదాపు 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మా మూవీ కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాం. ఎన్ని సినిమాలు ఉన్నా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ నిలబడుతుంది అని నమ్ముతున్నాం.
TFJA

Recent Posts

హీరో సుధాకర్ కోమాకుల ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల !!!

శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చార్లీ చాప్లిన్…

8 minutes ago

‘హల్కా డాన్’గా ‘లెనిన్’లో విలక్షణ నటనతో మెప్పించిన ప్రమోద్.. అదిరిపోయిన మాస్ ఫస్ట్ కట్ టీజర్..!

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా…

11 minutes ago

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్..!

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’ (చాప్టర్ క్లోజ్). వికాస్,…

16 minutes ago

డిసెంబర్ 11న విడుదలకు సిద్ధమైన ‘ప్యారడాక్స్ హరికథ’.. రొమాంటిక్ మెలోడీ ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ విడుదల!

డిసెంబర్ 11 న 'పారడాక్స్ హరికథ’ చిత్రం విడుదల....‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్* ఐరావత సినీ కలర్స్,…

33 minutes ago

“ఇడుపు కాయితం” నవ్విస్తూ, ఆలోచింపజేసే మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం- టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్..!

డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్…

37 minutes ago