ఓటీటీలో అదరగొడుతోన్న ‘అమీర్ లోగ్’

Must Read

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీలో ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బస్తీలోని స్నేహాన్ని, ప్రేమను, బంధాల్ని చాటి చెప్పే చిత్రంగా అందరి హృదయాల్ని గెల్చుకుంది. ఈ సినిమాలోని పాటలు హైదరాబాద్ కల్చర్‌కి ఆంథమ్‌లా మారిపోయాయి. కుర్రాళ్లకు స్పూర్తినిచ్చేలా, మంచి సందేశంతో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది.

ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి పాత్రలకు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా గ్రాండ్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచి రిలీజ్ దొరకడం, ఆడియెన్స్‌ నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌ చేస్తోంది.

ప్రస్తుతం ‘అమీర్ లోగ్’ మూవీని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి స్మరణ్ సాయి ఇచ్చిన సంగీతం, ఎస్వీకే సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Latest News

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య” గ్లింప్స్

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య". ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్...

More News