Categories: Uncategorized

ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ పాట విడుదల

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు పాట విడుదలైయింది.

కంపోజర్ ఎస్ థమన్ మాస్ బీట్‌లతో చాలా రిథమిక్‌గా ఉండే క్రేజీ లిరిక్స్‌తో పెప్పీ, మాస్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. పాట మూడ్  టెంపోను ఎనర్జిటిక్ గా చేశారు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే   హుషారుగా పాడిన ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్‌ మరింత ఆకర్షణగా నిలిచాయి.

రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల, రామ్‌ ఎనర్జీ ని మ్యాచ్ చేసింది. ఇద్దరూ ఎలిగెంట్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. కాస్ట్యూమ్స్‌, కలర్‌ఫుల్‌ సెట్‌ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.  తమ్మిరాజు ఎడిటర్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయణ

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago