అడవికి రాజు గర్జించే సమయం ఆసన్నమైంది

Must Read

బ్లాక్ బస్టర్ లెగసీ మళ్ళీ ప్రారంభం అయ్యింది: డిస్నీ యొక్క ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఈ డిసెంబర్ 20న విడుదల కానుంది.

ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎదుగుదల ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లోర్ చెయ్యడమే ఈ కథాంశం.

ప్రపంచ వ్యాప్తంగా ‘ది లయన్ కింగ్’ సినిమాకి అభిమానులు ఉన్నారు. 1994లో వచ్చిన యానిమేషన్ సినిమా నుండి ఈ పరంపర మొదలైంది. ఆ మానియా ఎన్నాళ్ళైనా తగ్గకపోయేసరికి మేకర్స్ రియలిస్టిక్ 3D యానిమేషన్ లో ఇంకో సారి చిత్రీకరించి 2019లో విడుదల చేశారు. అది కుడా పెద్ద సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు ‘కింగ్: ముఫాసా’ కథని బేస్ చేసుకుని ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనే కథాంశం మీద ఈ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ని ఈ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల నుండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విశేష స్పంధన ట్రైలర్ కు లభించింది.

ఈ చిత్రాన్ని బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు, ప్రేక్షకులకి రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ని ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తీస్తున్నారు. ఈ మానియాని ఎంజాయ్ చెయ్యడానికి dec 20 కోసం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఫాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News

Sanjay Leela Bhansali’s Love And War has fixed 20 March 2026

AR The announcement of Sanjay Leela Bhansali's next epic saga titled LOVE AND WAR, starring Ranbir Kapoor, Alia Bhatt,...

More News