బిగ్బాస్ ఇనయ సుల్తానా నటించిన నటరత్నాలు మే 17న విడుదల

Must Read

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కు చాలా మంచి స్పందన లభించింది. ‘నటరత్నాలు’ మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ : సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంత సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ అలాగే టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మే 17న మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత చంటి యలమాటి గారు మాట్లాడుతూ : మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమా నటరత్నాలు. సూర్యకిరణ్ లో ఒక నటుడిని చూస్తారు. డైరెక్టర్ శివ నాగు నాకు ఈ నటరత్నాలు కథ చెప్పడం జరిగింది. ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పైన మంచి స్పందన లభించింది. మే 17న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు.

నటీనటులు :
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి మరియు టైగర్ శేషాద్రి.

టెక్నీషియన్స్ :
నిర్మాణం : చందన ప్రొడక్షన్స్ మరియు ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : చంటి యలమాటి, డాక్టర్ దివ్య
సహ నిర్మాతలు : ఆనందాసు శ్రీ మణికంఠ, కోయి సుబ్బారావు
మ్యూజిక్ : శంకర్ మహదేవ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నర్రా శివనాగు
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పిఆర్ఓ : మధు VR

Latest News

Audience will connect with the character of Baghi that I play in Drinker Sai Aishwarya Sharma

The film Drinker Sai stars Dharma and Aishwarya Sharma in the lead roles, with the tagline Brand of Bad...

More News