స్నో కింగ్డమ్ లో ‘గామి’ మూవీ ZEE 5లో చూసి ఎంజాయ్ చేయండి

విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8లో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్‌డమ్‌లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీందే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. గామిలాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. గామిలో కమర్షియల్ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. గామిని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి? మా కాన్సెప్ట్ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బడ్జెట్ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. జీ5లో ఏప్రిల్ 12 నుంచి మా స్ట్రీమింగ్ అవుతుంది..
అందరూ వీక్షించండి’ అని అన్నారు.

లాయిడ్ జేవియర్ (జీ 5 సౌత్, వైస్ ప్రెసడెంట్ – మార్కెటింగ్) మాట్లాడుతూ.. ‘గామిలాంటి మంచి చిత్రాన్ని తీసిన విద్యాధర్, విశ్వక్ సేన్‌లకు థాంక్స్. ఈ రోజు ఇలా వినూత్నంగా ఆలోచించి ఈవెంట్‌ను నిర్వహించాం. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. అందరూ ఎంజాయ్ చేసుంటారని భావిస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుందని ఇలా స్నో కింగ్‌డమ్‌లో ఈవెంట్ పెట్టాం. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడలో జీ5లో గామి స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ వీక్షించండి. 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఇదొకటి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

11 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

11 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago