జీ5…మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద డిజిటల్ మాధ్యమంగా అవతరిస్తోంది. వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది.
వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌కు రైటర్, డైరెక్టర్‌గా గౌతమి చల్లగుల్ల వ్యవహరిస్తున్నారు. రాజీవ్ రంజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
పాస్ట్రీ, గాంధీ, హిప్పీ, బ్యాచిలర్స్, ప్రేమికుల జంట ఇలా పలు రకాలైన కుటుంబాలన్నీ కలిసి ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే విలక్షణమై కుటుంబాల మధ్య ఉండే నాటకీయతను మాయాబజార్ ఫర్ సేల్ సిరీస్‌లో ఆవిష్కరించబోతున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వారందరూ ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని అనుకుంటుంటారు. ఆ సమయంలో వారి గేటెడ్ కమ్యూనిటీ అనధికారికమైన కట్టడమంటూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుంది. వాటిని కూలగొట్టడానికి బుల్డోజర్స్ వస్తాయి. వ్యక్తిగత జీవితాలతో పాటు సామాజికి జీవితాలను కూడా ఈ ఒరిజినల్‌లో చక్కగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
నేటి అధునిక సమాజంలో కుటుంబాలు ఎలా ఉన్నాయనే వాటితో పాటు సామాజిక జీవన విధానం ఎలా ఉందనే విషయాలను మాయాజబార్ ఫర్ సేల్ ఒరిజినల్‌లో వ్యంగంగా, హాస్యాన్ని కలబోసి చూపించబోతున్నారు. ఇందులో నవదీప్, ఈషా రెబ్బా, నరేష్ విజయ్ కుమార్, హరితేజ, ఝాన్సీ లక్ష్మీ, మియాంగ్ చంగ్, సునైన, కోట శ్రీనివాసరావు తదితరులు తమదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు. త్వరలోనే ఈ సెటైరికల్ డ్రామా జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘‘మాయాబజార్ ఫర్ సేల్ వంటి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మన అందరికీ నచ్చేలా సునిశితమైన కామెడీతో రూపొందిన ఈ ఒరిజినల్ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
నిర్మాత రాజీవ్ రంజన్ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఆనందం అంటే ఎలా ఉంటుంది. దాన్ని సమాజం ఎలా అంచనావేస్తుంది అనే అంశాలను మాయాబజార్ ఫర్ సేల్ సిరీస్‌లో చూపిస్తున్నాం. అది కూడా ఎంటర్‌టైనింగ్‌గా. నవదీప్, నరేష్, ఈషారెబ్బా, మియాంగ్ ఇలా అందరూ వారి వారి పాత్రలను సమర్దవంతంగా నిర్వహించారు. ఈ సిరీస్ తెలుగులో సరికొత్తగా అందరినీ ఆకట్టుకుంది. వారి మనసుల్లో ఇది నిలిచిపోతుంది’’ అన్నారు.
దర్శకుడు గౌతమి చిల్లగుల్ల మాట్లాడుతూ ‘‘ప్రజలందరూ ఈ మాయబజార్ ఫర్ సేల్ సిరీస్ చూసే సమయంలో తమని తాము అద్దంలో చూసుకున్నట్లు ఫీల్ అవుతారు. వారి జీవితాల్లో సంతోషాలను, బాధలు అన్ని ఉంటాయి. నాకు నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతమైన సపోర్ట్ను అందించారు. దీనికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి సపోర్ట్ రానుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
‘మాయబజార్ ఫర్ సేల్’ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అందరూ ట్యూన్ చేసేయండి.