టాలీవుడ్

జూలై 25న ‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్

సినీ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేస్తోన్న యశ్ రాజ్ ఫిల్మ్స్.. జూలై 25న ‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్

War 2 మూవీకి సంబందించి 25వ నెంబర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను ఒకే సినిమాలో నటింపజేసే అపూర్వ అవకాశాన్ని నిర్మాత ఆదిత్య చోప్రా సాధించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న WAR 2ను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సంవత్సరం తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారన్నది ఒక అద్భుతమైన విషయం. ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా WAR 2 ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేస్తుంది.

ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ చేసిన గొప్ప సేవ‌ల‌ను అభినందిస్తూ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 మూవీ ట్రైల‌ర్ లాంచ్ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. “2025లో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఇద్ద‌రు గొప్ప స్టార్స్, వీరు త‌మ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్స్‌. ఈ అరుదైన క్ష‌ణాల‌ను మ‌రింత గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి జూలై 25న WAR 2 ట్రైలర్ విడుదల చేస్తున్న‌ట్లు య‌శ్ రాజ్ ఫిల్మ్స్ తెలియజేస్తోంది. ఇది ఇద్దరి గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం! జూలై 25 తేదీని మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని సంస్థ పేర్కొంది.

వార్ 2 సినిమా హిందీ, తెలుగు, తమిల, భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా బారీగా విడుదలవుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

4 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago