‘మత్తువదలరా’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. ఆగస్ట్‌లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ‘ఉస్తాద్’ చిత్రాన్ని ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
`ఉస్తాద్` ట్రైలర్‌ను పరిశీలిస్తే..సాధారణ మధ్య తరగతి యువకుడు సూర్య ఆకాశంలో ఎగరాలని కలలు కంటాడు. ఆ కలలను సాధిస్తాడు. ఆ యువకుడి కో పైలట్ జోసెఫ్ డిసౌజా పాత్రలో గౌతమ్ వాసుదేవ్ నటించారు. సూర్య పాత్రలో శ్రీసింహా కోడూరి నటిస్తే, తన ప్రేయసి పాత్రలో కావ్యా కళ్యాణ్ రామ్ నటించింది. తను ప్రేమించిన అమ్మాయితో పాటు సూర్యకు తన ఉస్తాద్ బైక్ అంటే ఎంతో ఇష్టం. డైరెక్టర్ ఫణిదీప్ ట్రైలర్‌లో సూర్య ప్రపంచాన్ని చక్కగా ఆవిష్కరించారు.
శ్రీసింహ, కావ్యా కళ్యాణ్ రామ్, అనుహాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ, రవి శివతేజ, సాయికిరణ్ ఏడిద తదితరులను ట్రైలర్‌ను చక్కగా చూపించారు డైరెక్టర్. వీరి తమమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ట్రైలర్‌తో చిన్న టచ్ ఇచ్చారు. శ్రీసింహ ఇందుల మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. కావ్యా కళ్యాణ్ రామ్ పాత్ర ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌నిస్తుంది. ఈ చిత్రానికి అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ. రవి శివ తేజ, సాయి కిరణ ఏడిద తదితరులు
సాంకేతిక వర్గం:
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
బ్యానర్స్: వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
రచన, దర్శకత్వం: ఫణిదీప్
సినిమాటోగ్రఫీ: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవా.బి
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములె
సౌండ్ డిజైన్: అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్స్: ప్రియాంక వీరబోయిన
వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్: సునీల్ రాజు చింత
లిరిక్స్: అనంత శ్రీరాం, రెహమాన్, లక్ష్మీ ప్రియాంక
లైన్ ప్రొడ్యూసర్స్: ప్రజనయ్ కొనిగరి, రాజేష్ గడ్డం
పి.ఆర్.ఒ: వంశీ కాకా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…