టాలీవుడ్

యంగ్ హీరో ఆశిష్ మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభం

యంగ్ హీరో ఆశిష్ మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభం.. రొమాంటిక్ హారర్ బ్యాక్ డ్రాప్ కోసం రంగంలోకి టాప్ టెక్నీషియన్స్ 

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో ఆశిష్. ఇప్పుడు సెల్ఫీష్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆశిష్  మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. ఈ ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో ‘బలగం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని అందించిన యంగ్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలతో పాటు నాగార్జున మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ కోసం సినీ ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు.

త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

8 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago