యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్: 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

Must Read

2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఈశా ఫౌండేషన్‌ – కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం, అలాగే బెంగళూరులోని సద్గురు సన్నిధిలో ఎన్‌సిసి (NCC) కేడెట్‌లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కోసం ప్రత్యేక యోగా సెషన్‌లను నిర్వహించింది.
భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1000 ఉచిత యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇందులో కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, రక్షణ సంస్థలు, ఇంకా స్థానిక సంఘాల నుండి సుమారు 50,000 మంది పాల్గొన్నారు.

జూన్ 21, 2026: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు, “మీకు తెలిసిందే, పన్నెండేళ్లు అనేది సుమారుగా ఒక సౌర చక్రం. కాబట్టి మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవపు ఒక చక్రం పూర్తి చేశాం. తమను తాము చక్కదిద్దుకునే మార్గాలు ఉన్నాయని ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు.

యోగా యొక్క నిజమైన పరమార్థాన్ని నొక్కిచెబుతూ సద్గురు, “మనం యోగా అంటున్నది ఒక తత్వశాస్త్రం కాదు, సిద్ధాంతం కాదు, నమ్మకం కాదు, మతం కాదు. చాలామంది అనుకుంటున్నట్లుగా కచ్చితంగా ఇది శరీరాన్ని మెలితిప్పడం గురించి కాదు” అని అన్నారు. బాహ్య శ్రేయస్సు కోసం సైన్స్ ఇంకా టెక్నాలజీ ఎలాగైతే ఉన్నాయో, అంతరంగ శ్రేయస్సు కోసం కూడా ఒక సంపూర్ణమైన సైన్స్ ఇంకా టెక్నాలజీ ఉన్నాయి అని గుర్తుచేసేదే యోగా అని ఆయన వివరించారు.

x.com/sadhgurujv/status/2068556530476064830

మానవాళి ఎదుర్కొంటోన్న సవాళ్లలో చాలా వాటికి కారణం, మానవ అనుభూతి యొక్క మౌలిక పునాదిని అర్థం చేసుకోకపోవడమే అని ఆయన ఉద్ఘాటించారు. “మానవ అనుభూతి అనేది మన లోపలి నుంచే జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయికి తీసుకెళ్లాలంటే, అంతర్ముఖులవ్వడమే ఏకైక మార్గం. ఇది జరిగి తీరాలి. యోగా ప్రాథమిక లక్ష్యం ఇదే.”

ఈ సందర్భంగా, ఈశా ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1,000 ఉచిత యోగా ఇంకా ధ్యాన కార్యక్రమాలను నిర్వహించింది. కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, రక్షణ సంస్థలు, వివిధ స్థానిక సంఘాల నుండి సుమారు 50,000 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, మెరుగైన జీవన ప్రమాణాలకు తోడ్పడేలా రూపొందించిన సరళమైన యోగ పద్ధతులను, ధ్యాన ప్రక్రియలను వారికి పరిచయం చేశారు.

కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 700 మందికి పైగా స్వయంగా పాల్గొన్నారు. ఇందులో యంగ్ ఇండియన్స్ కోయంబత్తూరు చాప్టర్ నుండి 500 మంది విద్యార్థులు, అలాగే 200 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది ఉన్నారు. ఇక బెంగళూరులోని సద్గురు సన్నిధిలో ఉన్న ఆదియోగి వద్ద జరిగిన యోగా ఇంకా ధ్యాన కార్యక్రమాలలో NCC కేడెట్‌లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు, వాలంటీర్లు, సాధారణ ప్రజలతో కలుపుకుని మొత్తం 2,500 మందికి పైగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సద్గురు అందిస్తున్న ఉచిత గైడెడ్ మెడిటేషన్ యాప్ ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ (Miracle of Mind)కి ఆరు కొత్త భాషలను జతచేశారు – గుజరాతీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇటాలియన్ మరియు నేపాలీ. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడేవారు ఈ 7 నిమిషాల ధ్యాన ప్రక్రియను మరింత సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్ ఇప్పుడు 12 భాషల్లో అందుబాటులో ఉంది. దీన్ని isha.sadhguru.org/in/en/miracle-of-mind ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

Latest News

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ టీమ్

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్...

More News