ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.
పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. అసలే టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండగా.. ఇప్పుడు నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకు రాబోతున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…