‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’

భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా ఈ చిత్రాన్ని షూట్ చేస్తుండటంతో చిత్ర నిర్మాతల నిబద్ధత ప్రతిబింబిస్తుంది. ప్రాంతీయ భాషకు వారు ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయాలన్న ఉద్దేశాన్ని ఇలా చెప్పకనే చెప్పేశారు.

గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ..‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతోన్న టాక్సిక్ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాధించేలా రూపొందిస్తున్నాం. అందుకే కన్నడ, ఆంగ్ల భాషల్లో తెరకెక్కిస్తున్నాం. మా ఈ చిత్రం అన్ని సరిహద్దుల్ని చెరిపివేస్తుందని భావిస్తున్నాం. అన్ని భాషల, సాంస్కృతిక ప్రపంచాన్ని కలిపేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

KVN ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ నారాయణ సంయుక్తంగా నిర్మించిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా అనేక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు పొందిన గీతూ మోహన్‌దాస్ ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పని చేసిన జేజే పెర్రీ యాక్షన్ సీక్వెన్స్‌లకు గ్లోబల్ ఆడియెన్స్ ఫిదా కానున్నారు. అంతే కాకుండా రీసెంట్‌గా డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్‌కి గానూ బాఫ్టా ఫిల్మ్ అవార్డుని అందుకున్న డినెగ్ ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నారు.

రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ టీజర్ ఎన్నో రికార్డుల్ని క్రియేట్ చేసింది. టాక్సిక్ ప్రపంచాన్ని ఆ టీజర్ అందరికీ పరిచయం చేసింది. ఈ టీజర్ సినిమా స్థాయిని, అంతర్జాతీయ-ప్రామాణిక నిర్మాణ విలువలను చాటి చెప్పింది. ఈ టాక్సిక్ చిత్రీకరణ గత ఏడాది ఆగష్టులో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రాల్లో టాక్సిక్ ఒకటిగా నిలవనుంది.

నిర్మాత వెంకట్ కే నారాయణ మాట్లాడుతూ.. ‘‘టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే చిత్రంగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. మొదటి నుంచీ ఈ కథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రతిభను కూడా ప్రదర్శించేలా టాక్సిక్ రాబోతోంది’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 days ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 days ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 days ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 days ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 days ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

2 days ago