టాలీవుడ్

“క” విజయంతో ప్రేక్షకులు తమ ఇంట్లో అబ్బాయిగా నన్ను అక్కున చేర్చుకున్నారు కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి “క” సినిమా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా రెండు రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ విశ్వాస్ డేనియల్ మాట్లాడుతూ – “క” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిస్తోంది. నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు హీరో కిరణ్ గారు. ఆయనకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెబుతున్నా. మరో డీవోపీ సతీష్ రెడ్డిని నా ఆత్మలా భావిస్తా. డైరెక్టర్స్ సుజీత్, సందీప్ లో సుజీత్ నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఈ సినిమాకు ఎంతో కష్టపడినా ఇష్టంతో వర్క్ చేశాం. ఈ రోజు ప్రేక్షకులు ఆ ఔట్ పుట్ ను థియేటర్స్ లో ఆదరిస్తున్నారు. అన్నారు.

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. మేమంతా ఒక ఫ్యామిలీలా టీమ్ ఎఫర్ట్ పెట్టి పనిచేశాం. కిరణ్ గారు మాకు ముందు నుంచీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రొడ్యూసర్ గోపి గారి సపోర్ట్ వల్లే మేమంతా ఇంత బాగా వర్క్ చేయగలిగాం. అన్నారు.

ఎడిటర్ శ్రీ వరప్రసాద్ మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే సినిమాను చిన్నా పెద్దా అని తేడాలు చూడం, తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు “క” సక్సెస్ తో మరోసారి ప్రూవ్ చేశారు. అన్నిచోట్ల నుంచీ హౌస్ ఫుల్ రిపోర్ట్ వస్తోంది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పడం ఎంతో హై ఫీలింగ్ కలిగిస్తోంది. అన్నారు.

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – కిరణ్ గారు ఫస్ట్ క సినిమా స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన కళ్లల్లో ఒక పట్టుదల చూశాను. కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. మా సినిమాకు టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వాలని టీమ్ వర్క్ చేశారు. అలాగే వీలైనంత తక్కువలో ఎంత బాగా సినిమా చేయాలని వాళ్లు ప్రయత్నించారు. ప్రొడ్యూసర్ ను కాపాడుకోవాలి, అతను బాగుంటే ఇంకా సినిమాలు చేస్తాడని మా టీమ్ గట్టిగా కృషి చేసింది. కిరణ్ గారు ఎక్కువగా మాట్లాడేవారు గీత గోవిదంలో విజయ్ దేవరకొండలా, నేను రశ్మికలా తక్కువ మాట్లాడేవాడిని. ఈ రోజు అవన్నీ రీకాల్ చేసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. నేనేనా ఇంత పెద్ద సూపర్ హిట్ సినిమా చేశాను అనిపిస్తోంది. ఇంకా నమ్మకం కుదరడం లేదు అందుకే సక్సెస్ కిక్ రావడం లేదు. నా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – క సినిమా నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, మనం ఇరవై కోట్లు కాదు వంద కోట్ల సినిమా కొడుతున్నాం అని కిరణ్ చెప్పాడు. అతని మాటలే నాలో ఎంతో నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమాను పెద్ద సంస్థలు కావాలని అడిగినా కిరణ్ గారి మాట మీద నాకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గోపి గారికి థ్యాంక్స్. గోపి గారి లాంటి ప్రొడ్యూసర్ బాగుంటే కిరణ్ లాంటి హీరోలు మరో పది మంది వస్తారు. నాలాంటి వాళ్లు మరో వంద సినిమాలు చేస్తారు. అన్నారు.

డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ – క సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. మా డైరెక్షన్ టీమ్ రాత్రీ పగలూ కష్టపడ్డారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల విషయంలో చిన్నా పెద్దా అనేది లేదు. మనకున్న బడ్జెట్ లో ఎంత బాగా సినిమాను రూపొందించాము అనేది ఇంపార్టెంట్. క సినిమా విషయంలో మేము అలాంటి ప్రయత్నం చేశాం. మాకున్న సోర్సెస్ లో ఒక మంచి మూవీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఫ్యూచర్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేయాలనుకుంటున్నాం. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – మా మూవీ థియేటర్ లో చూసేందుకు వెళ్తాను. ఆడియెన్స్ మధ్య కూర్చుని చూస్తానని అడిగితే థియేటర్ వాళ్లు సీట్స్ ఖాళీగా లేవు అన్నారు. ఒక నాయికగా నాకు ఇంతకంటే సంతోషించాల్సిన విషయం మరొకటి లేదు. మా క మూవీకి ఆడియెన్స్ అంత బాగా ఆదరణ చూపిస్తున్నారు. నా కెరీర్ లో సత్యభామ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్నారు.

డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ – ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్ అయిన మాకు క వంటి బ్లాక్ బస్టర్ తొలి చిత్రంతోనే దక్కడం చాలా సంతోషంగా ఉంది. మా మొదటి సినిమానే హౌస్ ఫుల్స్ చూస్తున్నాం. క ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ను ప్రేక్షకులంతా ఆదరిస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారంటే ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ గా నిలిచిన కిరణ్ గారితో పాటు టీమ్ లోని ప్రతి మెంబర్ కు మేము థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – పండుగ కాంపిటేషన్ లో రిలీజైన మా క సినిమాకు పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇలాంటి సరికొత్త కంటెంట్ తో సినిమా చేసిన మా డైరెక్టర్స్ కు, అలాగే సినిమాను ఇంత బాగా వచ్చేలా అన్ని విషయాలూ చుసుకున్న కిరణ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – క సినిమాకు ఘన విజయాన్ని అందించి ఈ దీపావళికి నాకు పెద్ద పండుగ ఇచ్చారు. మన తెలుగు ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు. టికెట్స్ కావాలని, ఇంకా థియేటర్స్ పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు, నాగవంశీ గారు, 14 రీల్స్ రామ్, గోపి గారు వీళ్లంతా శుభాకాంక్షలు తెలిపడం సంతోషంగా ఉంది. ఈ నెల 8వ తేదీన మలయాళంలో క సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అలాగే తమిళనాట ఉన్న తెలుగు ప్రజలు తమకు షోస్ కావాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక తమిళనాట ఎందుకు రిలీజ్ చేయడం లేదని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ గారిని తమిళనాట షోస్ వేయమని అడుగుతున్నా. ఫ్యామిలీస్ అంతా కలిసి మా క సినిమా చూసేందుకు వెళ్తున్నారు. అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ట్రెండ్ ప్రీమియర్స్ నుంచే మొదలైంది. అన్నారు. క సినిమా విజయం నాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చింది. హిట్ కొట్టాడు అనకుండా హిట్ కొట్టేశాము అంటున్నారు. ఇది తమ విజయంగా భావిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక హీరోగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. ఇంతమంది ఆదరణ ప్రేమ దక్కుతున్నాయి. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందా అనేది కాదు, ప్రేక్షకులకు చేరువైంది అనే విషయమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. క సినిమాకు తప్పకుండా సీక్వెల్ చేస్తాం. అది కృష్ణగిరి ఊరి ప్రత్యేకతలతో ఉంటుంది. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

Tfja Team

Recent Posts

Star boy Siddhu Jonnalagadda, Bommarillu Baskar, and BVSN Prasad’s JACK team ropes in the talented Sam CS to compose the background score

Star boy Siddhu Jonnalagadda's upcoming film "Jack - Konchem Krack" directed by Bommarillu Bhaskar is…

7 days ago

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ - కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు.…

7 days ago

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై…

2 weeks ago

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati…

2 weeks ago

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించిన మ్యాజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘టుక్‌ టుక్‌’

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో చిత్రీకరించిన 'ఏలా అల తీపికోరే పూలతోట' పాట విడుదల అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన…

2 weeks ago

For the First Time in Indian Cinema: AI-Generated Song Featured in the Film Tuk Tuk

The Indian film industry continues to embrace cutting-edge technology, with filmmakers increasingly integrating advanced visual…

2 weeks ago