బిఎస్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై హర్ష రోషన్, హారిక హీరో హీరోయిన్లు గా కామ్నాజెఠ్మలానీ ప్రధాన పాత్రలో భాస్కర్ రామ్ దర్శకత్వంలో, భిక్షమయ్య గారు నిర్మిస్తున్న ఎంటర్టైన్మెంట్ మూవీ ,వాట్సప్ రోమియో. ఈ చిత్రం నేడు ఫస్ట్ లుక్ ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు
భాస్కర్ రామ్ మాట్లాడుతూ వాట్స్ అప్ రోమియో..వీడి ప్రేమ అందరికీ..మూవీ డైరెక్టర్ని.టెక్నికల్ గా బాహుబలి.. కె జి ఎఫ్..లాంటి పాన్ వరల్డ్ మూవీస్ లో..రాజమౌళి గారు..ప్రశాంత్ నీల్ గారు లాంటి దిగ్ దర్శకులతో,టెక్నికల్ విభాగం లో కలిసి వర్క్ చేయటం జరిగింది..అలాగే బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కి కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేయటం జరిగింది..తెలుగు లో డైరెక్టర్ గా ఇది నా సెకండ్ మూవీ..నా ఫస్ట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది..మరాఠీ లో నేను డైరక్ట్ చేసిన దిల్..దోస్తీ..దునియాదారీ అనే మూవీ ఈ మంత్ లోనే రిలీజ్ కి ఉంది..ఈ మూవీ కి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా SRICA 2023..సత్యజిత్ రే సినిమా ఐకానిక్ అవార్డు అందుకోటం జరిగింది..
ఇంక ఈ సినిమా విషయానికి వస్తే..ఈ సృష్టి లో తల్లి మనసు ఎంత స్వచమైనదో,పిల్లల మనసు కూడా అంతే స్వచ్చ మైనది.పిల్లలను ప్రాపర్ గా గైడ్ చేస్తే,వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తారు.సృష్టిస్తారు.అలాంటి ఓ పిల్లాడి కథే మా వాట్సప్ రోమియో..(వీడి ప్రేమ అందరిదీ)..రోమియో అంటే ఒక ఆకతాయి కుర్రాడి గానే మన అందరికీ తెలుసు..కానీ మా మూవీ లో రోమియో పాత్ర చాలా భిన్నం గా వుంటుంది..ప్రతి ఒక్కరినీ ప్రేమించే మనస్తత్వం మా రోమియోది..ఈ పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్స్ చేశాం..ఎప్పుడైతే.. మా హీరో హర్ష్ రోషన్ని కలిశామో..కేవలం ఈ అబ్బాయి ఐతేనే..ఈ పాత్ర కు న్యాయం చేయగలడు అనిపించింది..ఈ సినిమాని మేము తెలుగు తమిళ భాషల్లో చిత్రికరిస్తున్నాం.అలాగే హిందీ ఇతర భాషల్లో..డబ్బింగ్ చేస్తున్నాం..ఇది అమేజాన్ ప్రైమ్ ప్రీ అప్రూవల్ ప్రాజెక్టు .ఈ మూవీ మొత్తం మధ్య ప్రదేశ్, హైదరాబాద్,విశాఖపట్నం ల లోని అందమైన లొకేషన్స్ లో ..మొత్తం మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తా
చేస్తాం అని అన్నారు .
చిత్ర నిర్మాత బిక్షమయ్య సంగెంమాట్లాడుతూ ఇదొక వెరైటీ సబ్జెక్ట్. భోపాల్ మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాం. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను .అని అన్నారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ రోజా భారతి, హీరో హర్ష రోషన్, హీరోయిన్ హారిక, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు
• బ్యానర్: BS ప్రొడక్షన్ హౌస్
• నటీనటులు : హర్ష రోషన్ (హీరో) హారిక (హీరోయిన్)
మైథిలి(పరిచయం)
కామ్నా జెఠ్మలానీ
అలోక్ జైన్
శివరాజ్ వాల్వేకర్
గోపాల్ శ్యామ్
మధు సూధన్
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
• రచయిత & దర్శకుడు – భాస్కర్ రామ్
• నిర్మాతలు – బిక్షమయ్య సంగం
• సంగీత దర్శకుడు – జయవర్ధన్
• DOP – రంజిత్ ఎమ్
Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…
మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ…
The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…
తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…
Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…