‘వెపన్’ ఆకట్టుకుంటోన్నయాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ టీజర్

Must Read

వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం ‘వెపన్’.. ఆకట్టుకుంటోన్నయాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ టీజర్

WEAPON Telugu Official Teaser | Sathyaraj,Vasanth Ravi | Million Studio | Ghibran | Guhan Senniappan

మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రోజున విడుదల చేశారు. టీజర్ ను గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ ఇన్టెన్స్ థ్రిల్లర్ లో సత్యరాజ్, వసంత్ రవి పాత్రలను నెక్ట్స్ రేంజ్ లో రూపొందించినట్లు స్పష్టమవుతుంది. సత్యరాజ్, వసంత్ రవిలపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నటన పరంగా ఇటు సత్యరాజ్, అటు వసంత్ రవి తమదైన విలక్షణతను చాటుకునేలా పెర్ఫామెన్స్ ఇరగదీశారు.

ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తున్నాయి. సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణ జరుగుతుంటుంది. అసలా సూపర్ హ్యుమన్ ఎవరు సత్యరాజా? వసంత్ రవినా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేననే క్యూరియాసిటీ కలుగుతుంది. సినిమా ట్రైలర్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.

ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:

సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై, యషికా ఆనంద్, మైమ్ గోపి, కణిత, గజరాజ్, సయ్యద్ సుభాన్, భరద్వాజ్ రంగన్ తదితరులు

సాంకేతిక వర్గం:

దర్శకత్వం: గుహన్ సెన్నియ్యపప్పన్
నిర్మాణం: మిలియన్ స్టూడియో
సంగీతం: గిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్
ఎడిటర్: నష్
ఆర్ట్: సుబేందర్ పిళ్లై
యాక్షన్: సుదేశ్
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణీ కందుకూరి (బియాండ్ మీడియా)

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News