‘ARM’ ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం హానర్ గా భావిస్తున్నాం.

Must Read

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో  కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. “ARM” సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ARM’  ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఒక బ్రాండ్. వారు మా సినిమాని తెలుగు లో రిలీజ్ చేయడం హానర్ గా భావిస్తున్నాం. దర్శకుడు ఈ కథ చెప్పి మూడు క్యారెక్టర్స్ ప్లే చేయమని అడిగినప్పుడు.. మూడు క్యారెక్టర్స్ ని చేయగలనా ? అని అలోచించాను. మరో ఇద్దరు యాక్టర్స్ ని తీసుకోవచ్చు కదా అని అడిగాను. మూడు పాత్రలని నేనే ఎందుకు చేయాలో వారు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆక్కడ నుంచి ఈ సినిమా ఒక డ్రీంలా జరిగింది. మరో మూడు రోజుల్లో ఆ డ్రీం నిజం కాబోతోంది. ఈ సినిమాపై మేమంతా చాలా నమ్మకంగా వున్నాం. రోహిణీ మేడం గారితో ఇది నా మూడో సినిమా. తను వండర్ ఫుల్ పెర్ఫార్మర్. హరీష్ తో పని చేయడం మూడోసారి. ఇందులో తన పాత్ర అందరినీ అలరిస్తుంది. ఐశ్వర్య క్యారెక్టర్ ఈ కథకి డ్రైవ్. తను అద్భుతంగా నటించింది. కృతి నాకంటే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. తను తెలుగులో సినిమా చేయమని చెప్పేది. నిన్న ఓ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజలు ఎంతగా ప్రేమిస్తారో అర్ధమైయింది. ఈ ఇండస్ట్రీలో పార్ట్ అవ్వాలని వుంది. సెప్టెంబర్ 12  “ARM” త్రీడీ థియేటర్స్ లోకి వస్తుంది. అందరూ చూడండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరం టీంగా పని చేశాం. అందరూ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. సినిమా మీకు నచ్చుతుంది. సినిమా మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్’ అన్నారు.  

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ముంబై, చెన్నై,  కర్ణాటక కేరళలో ప్రమోట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్లు వుంది. ఇది మంచి సినిమా. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారనే నమ్మకం వుంది. చాలా అద్భుతమైన కథ ఇది. జితిన్ ఈ సినిమా కోసం ఎనిమిదేళ్ళుగా కష్టపడ్డారు. సినిమాని అద్భుతంగా తీశారు. నన్ను తెలుగులో పరిచయం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. టోవినో థామస్ ఈ జనరేషన్ లో గ్రేట్ యాక్టర్. ఈ సినిమా కోసం ఒక యాక్టర్ ట్రైనీని కూడా తీసుకున్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇందులో హరీష్ గారి పాత్రని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సురభి లక్ష్మి అవుట్ స్టాండింగ్ రోల్ చేశారు. రోహిణీ మేడం తో పని చేయడం మెమరబుల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మలయాళంలో ఈ సినిమా నా డెబ్యు. అందరిసపోర్ట్ తో ఈ జర్నీ అద్భుతంగా జరిగింది. ఈ సినిమా త్రీడీలో వస్తుంది. తప్పకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.  

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ఇందులో జోది అనే క్యారెక్టర్ చేశాను. నా పాత్రని చాలా బ్యూటీఫుల్ గా డ్రాయింగ్ వేసి డైరెక్టర్ గారు నేరేట్ చేసినప్పుడు చాలా నచ్చింది. ఈ సినిమాలో భాగం కావడం హానర్ గా భావిస్తున్నాను. టోవినో థామస్ చాలా అంకితభావం కలిగిన యాక్టర్. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఈ సినిమా తనకి చాలా పెద్ద విజయాన్ని ఇవ్వబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతోంది. ఈ సినిమా నిర్మాతలకు ధన్యవాదాలు. నిర్మాతల వలెనే ఇలాంటి సినిమాలు సాధ్యమౌతాయి. కృతితో పాటు ఈసినిమా లో పని చేసిన అందరికీ థాంక్ యూ.  

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ..ARM సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత  లిస్టిన్ స్టీఫెన్ గారికి ధన్యవాదాలు.  ఈ సినిమా రిలీజ్ చేయడం హానర్ గా భావిస్తున్నాం. స్క్రీన్ ప్లే, విజువల్ గా ఈ సినిమా చాలా గ్రాండ్ గా వుంటుంది. మిన్నల్ మురళి, 2018 ద్వారా టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో ఈ సినిమా ద్వారా పదింతలు చేరువౌతారు. ఇందులో మూడు క్యారెక్టర్స్ అద్భుతంగా చేశారు. కృతి శెట్టిగారు మైత్రీ ద్వారానే పరిచయమయ్యారు. నేను కూడా ఉప్పెన సినిమాతోనే ఎంటరయ్యాను. అక్కడి నుంచి మైత్రీతో జర్నీ మొదలైయింది. ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి  పాత్రలు కూడా వేరే లెవల్ లో వుంటాయి. ఈ సినిమా చాలా పెద్ద బిగ్ బ్లాస్టర్ అవుతుందనే నమ్మకం వుంది. ఇది థియేటర్స్ లో త్రీడీలో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా. సెప్టెంబర్ 12న అందరం థియేటర్స్ లో కలుద్దాం’అన్నారు.  

యాక్టర్ హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ.. ARM  చాలా గ్రాండ్ సినిమా అని ట్రైలర్ చూస్తున్నపుడు మీ అర్ధమౌతుంది. ఇందులో మంచి ప్రేమకథ కూడా వుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా అద్భుతంగా నటించారు.  ఐశ్వర్య గారికి నేను ఫ్యాన్ ని. కృతి ఈ సినిమాలో లక్ష్మీ క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా చేశారు. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ పాత్రని చాలా ఎంజాయ్ చేశాను. టోవినో థామస్ కి అన్ని చోట్ల అభిమానులు వున్నారు. త్వరలోనే తను నేరుగా తెలుగులో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని త్రీడీలోనే చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది.    

యాక్ట్రెస్ రోహిణి మాట్లాడుతూ.. టోవినో థామస్  అందరూ గర్వపడే సినిమాలు చేస్తున్నారు. “ARM కూడా అలంటి ప్రతిష్టాత్మకమైన సినిమానే. డైరెక్టర్ మూడు కాలాలని జోడిస్తూ మూడు క్యారెక్టర్స్ అద్భుతంగా తీశాడు. ఇందులో నేను అజయన్ తల్లిగా కనిపిస్తాను. మరో కాలంలో తనది మా నాన్న పాత్ర. మరో కాలంలో మా తాత. చాలా అద్భతమైన కథ ఇది.ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మంచి హోమ్ వర్క్ చేశారు. సినిమా విజువల్ ఫీస్ట్ గా వుంటుంది. త్రీడిలో చేయడమే ఈ సినిమాకి యాప్ట్. టోవినో థామస్ కెరీర్ లో ఈ సినిమా మైల్ స్టోన్ గా నిలిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

Latest News

“Hathya” intriguing first look out now

Mahaakaal Pictures - SriVidya Basawa - S Prashanth Reddy's "Hathya" intriguing first look out now The popularity of the thriller...

More News