కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడుగా.. నేషనల్ అవార్డు విన్నర్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సోషల్ డ్రామా ‘కుబేర’. మైథలాజికల్ పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వేదికగా IPL 2024 ప్రసారం మధ్యలో విడుదల చేసిన నాగార్జున ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ IPL గేమ్ సమయంలో కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను టెలికాస్ట్ చేశారు. ఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని కళ్లద్దాలు పెట్టుకుని మ్యాన్లీగా కనిపించారు కింగ్ అక్కినేని నాగార్జున.
కుబేర నుండి మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన తమిళ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ లుక్‌కి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుండి థ్రిల్లింగ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌తో పాటు భారీ తారాగణం నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…