నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ #Nani30 ఫస్ట్ లుక్, గ్లింప్స్ జూలై 13న విడుదల
నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ మూవీ #Nani30 నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో భారీ స్థాయి తెరకెక్కుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని కొన్ని ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాని డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక.
మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. #Nani30 ఫస్ట్ లుక్, గ్లింప్స్ జూలై 13న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ వీడియో లో నాని పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించారు. సినిమా కోసం నాని ఎలాంటి రిస్క్ తీసుకున్నారో ఇది స్పష్టంగా సూచిస్తుంది. మరొక వీడియోలో మృనాల్ ఠాకూర్ ఇదే అనౌన్స్ మెంట్ చేస్తూ “ప్రవహించే సముద్రంలా, ప్రేమ మమ్మల్ని చుట్టుముట్టింది, మిమ్మల్ని చేరుకుంటుంది.” అని కోట్ చేశారు.
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.
యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
సిఒఒ: కోటి పరుచూరి
డీవోపీ: సాను జాన్ వర్గీస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఈవీవీ సతీష్
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…
బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…
▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…