‘మత్తువదలరా’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ‘ఉస్తాద్’ చిత్రాన్ని ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచి అందరి అటెన్షన్‌ను సంపాదించుకుంది. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్, ‘రోజు…’, ‘ఆకాశం అదిరే..’ అనే పాటలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ‘చుక్కల్లోంచి..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్ బస్సులో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తుంటుంది. ఆ బ్ససు అనుకోకుండా ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ .. హీరో ఉన్న టెంపో వ్యాన్‌లో ఎక్కుతుంది. అప్పుడు హీరోయిన్‌పై ఉన్న ప్రేమను ఊహించుకుంటూ పాడే పాటే ‘చుక్కల్లోంచి..’. సాంగ్ చాలా కూల్‌గా, వినసొంపుగా ఉంది. అకీవా.బి సంగీత సారథ్యంలో రెహమాన్ రాసిన పాటను కార్తీక్ చక్కగా అలపించారు.
సినిమా విషయానికి వస్తే.. శ్రీసింహ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. డిఫరెంట్ మూవీస్, పరిమిత బడ్జెట్‌లతో రూపొందుతోన్న సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఉస్తాద్ నిర్మాతలు అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ, రవి శివ తేజ, సాయికిరణ్ ఏడిద కీలక పాత్రల్లో నటించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ. రవి శివ తేజ, సాయి కిరణ ఏడిద తదితరులు
సాంకేతిక వర్గం:
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
బ్యానర్స్: వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
రచన, దర్శకత్వం: ఫణిదీప్
సినిమాటోగ్రఫీ: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవా.బి
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములె
సౌండ్ డిజైన్: అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్స్: ప్రియాంక వీరబోయిన
బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి విజయవంతమైన చిత్రాలను…
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి, మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి…
ఈరోజు ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా స్టార్ హీరోయిన్ నభా నటేష్ ను తన…
భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నటప్రపూర్ణ…