సినీ జ‌ర్న‌లిస్టుల చేతుల మీదుగా   `సౌండ్ పార్టీ` టైటిల్ లోగో లాంచ్‌

Must Read

ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్ర‌య‌త్నంగా  బిగ్ బాస్ – 5, టైటిల్ విన్నర్, వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్న నూతన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్ శేరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం నేటితో షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సార‌థి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్ట‌ర్ ను జ‌ర్న‌లిస్ట్ ల చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

 `సౌండ్ పార్టీ` లోగో ఆవిస్క‌రించిన అనంత‌రం ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ వై.జె రాంబాబు మాట్లాడుతూ…“మంగ‌ళ‌వారం స‌న్నీ ఏదో పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ ఒక వీడియో షేర్ చేసి…అంద‌ర్నీ షాక్ కి గురి చేశాడు.  కానీ ఈ రోజే తెలిసింది అది త‌న సినిమా టైటిల్ సౌండ్ పార్టీ అని. జ‌ర్న‌లిస్ట్ గా, యాంక‌ర్ గా, బిగ్ బాస్ విన్న‌ర్ గా ఒక్కోమెట్టు ఎదుగుతూ హీరోగా మంచి సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. సిల్వ‌ర్ స్క్రీన్ పై ఈ సినిమాతో ఇంకా సౌండ్ చేయాల‌ని కోరుకుంటూ. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ “ అన్నారు.

మ‌రో జ‌ర్న‌లిస్ట్ ల‌క్ష్మినారాయ‌ణ మాట్లాడుతూ…“జ‌ర్న‌లిస్ట్ గా మొద‌లైన స‌న్ని కెరీర్ దిన‌దినాభివృద్ధి చెందుతూ ముందుకెళుతోంది. ఈ సినిమాతో త‌ను సిల్వ‌ర్ స్క్రీన్ పై మ‌రింత సౌండ్ చేయాల‌ని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు“ అన్నారు.

 చిత్ర స‌మ‌ర్ప‌కుడు వి. జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ…“నిర్మాత ర‌వి గారు నేను మంచి మిత్రులం. త‌ను నాతో ఒక సినిమా చేయాల‌ని వ‌చ్చారు. కానీ అప్ప‌టికే నేను మ‌రో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాను. అందువ‌ల్ల నా చిర‌కాల మిత్రుడైన సంజ‌య్ తో సినిమా చేయ‌మ‌న్నాను.  అలా ప్రారంభ‌మైందే ఈ సినిమా.   ఎక్క‌డా ప్రాబ్ల‌మ్ రాకుండా అనుకున్న విధంగా , అనుకున‌న్న స‌మ‌యానికి సంజ‌య్ సినిమా  పూర్తి చేశాడు. అనుకున్న ప్ర‌కారం ఆగ‌స్ట్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

 సంగీత ద‌ర్శ‌కుడు మోహిత్ రెహ‌మానిక్ మాట్లాడుతూ..``స‌న్ని నాకు మంచి మిత్రుడు. సంజ‌య్ గారు మంచి స‌బ్జెక్ట్ తో ఈ సినిమా చేశారు. పాట‌లు కూడా బాగా కుదిరాయి.  క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంది“ అన్నారు.

 30 ఇయ‌ర్స్ పృథ్వీ మాట్లాడుతూ…“స‌న్నీతో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఎమ్మెల్యే గా న‌టిస్తున్నా. ద‌ర్శ‌కుడు ఎంతో క్లారిటీగా చెప్పి మాతో వ‌ర్క్ చేయించుకున్నాడు. ర‌విగారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. వి.జ‌య‌శంక‌ర్ తెర‌ వెనకుండి ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య రాకుండా  సినిమాను ముందుకు న‌డిపించారు“ అన్నారు.

Sound Party Movie Title Launch by TFJA President Lakshmi Narayana & Secretary YJ Rambabu | TFJA


 న‌టుడు శివ‌న్నారాయ‌ణ మాట్లాడుతూ…“సౌండ్ పొల్యూష‌న్ లేని సౌండ్ పార్టీ ఇది. ప్ర‌తి స‌న్నివేశం, డైలాగ్ ఎంతో బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. మా జ‌యశంక‌ర్ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉంటూ సినిమాను ముందుకు న‌డిపించారు“ అన్నారు.
 మిర్చి ప్రియ మాట్లాడుతూ…“ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. నేను ఇంత వ‌ర‌కు చేయ‌ని పాత్ర ఇందులో చేశాను“ అన్నారు.

   ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత‌, నిర్మాత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…`` మా మొదటి తెలుగు సినిమా షూటింగ్ పూర్తయిన సంద‌ర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్  కథా,కథనాన్ని న‌మ్మి సినిమాలు తెర‌కెక్కిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరే విభిన్నమైన మరియు ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడమే మా లక్ష్యం.  USA లో ఆంగ్ల చలన చిత్రాలు మరియు మ్యూజిక్ వీడియోలను నిర్మించడంలో మునుపటి అనుభవం ఉన్నందున,  తెలుగు సినిమా వైపు ఆకర్షించబడ్డాను. అయితే, నేను కేవలం సినిమాల్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదు.  సినిమా నిర్మాణంలో ప్రతి అంశంలోనూ పాలుపంచుకోవాలని అనుకున్నాను. ఈ కోరికే నన్ను ప్రతిభావంతులైన చిత్రనిర్మాతల తో కనెక్ట్ అవ్వడానికి మరియు సహకరించడానికి దారితీసింది. ఫలితంగా అనేక షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్ ఫిల్మ్‌ల నిర్మాణం జరిగింది. ఎన్నో ప్రశంసలు పొందిన వెబ్ చిత్రం “విటమిన్ షీ” విజయవంతంగా విడుదలైన తర్వాత,  ఈసినిమాతో  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. 25 కంటే ఎక్కువ స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ప్రతిభావంతుడైన సంజయ్ శేరీ  తో  “సౌండ్ పార్టీ` సినిమా చేశాము.  ఈ అద్భుతమైన ప్రయాణంలో, నా ప్రియ మిత్రుడు జయశంకర్ మార్గదర్శకత్వం మరియు స‌పోర్ట్  లభించడం నా అదృష్టం. అతని ప్లానింగ్ సినిమాకు ఎంతో ఉపయోగ‌ప‌డింది. నిబ‌ద్ద‌త క‌లిగిన టీమ్ దొర‌కడం వ‌ల‌న ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా సినిమా పూర్తి చేయ‌గ‌లిగాం.  మా సినిమా షూటింగ్‌ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాం అంటే మా చిత్ర‌ బృందం యొక్క అంకితభావం మరియు వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి ఆగ‌స్ట్ లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశాం“ అన్నారు.

 ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ…“ఈ సినిమా ప్రారంభ‌మై గుమ్మ‌డి కాయ‌ కొట్ట‌డం వ‌ర‌కు వ‌చ్చిందంటే అది కేవ‌లం నా మిత్రుడు జ‌య‌శంక‌ర్ వల్లే. త‌ను లేకుంటే ఈ సినిమా లేదు.  మా నిర్మాత ర‌వి గారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేయ‌డానికి స‌హ‌క‌రించారు. స‌న్నీ తో పాటు కాస్ట్ అండ్ క్రూ అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు.  ఇదొక ఫుల్ ఫ‌న్ రైడ్ చిత్రం. ఆగ‌స్ట్ లో రిలీజ్ కు ప్లాన్  చేస్తున్నాం“ అన్నారు.

 హీరో వి.జె స‌న్ని మాట్లాడుతూ..``నేను పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వ‌చ్చాయి. `సౌండ్ పార్టీ` టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత యుఎస్ లో ఉంటూ కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా పూర్తి చేయ‌డానికి స‌హ‌క‌రించారు. మా ద‌ర్శ‌కుడు సంజ‌య్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా సినిమా తీశాడు. జ‌య‌శంక‌ర్ అన్నీ తానై సినిమాను న‌డిపించాడు. క‌చ్చితంగా సౌండ్ పార్టీ థియేట‌ర్ లో గ‌ట్టిగా సౌండ్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నా“ అన్నారు.

  శివ‌న్నారాయ‌ణ , అలీ, సప్తగిరి, థర్టీఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరికిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్` ’ అంజలి, ఇంటూరివాసు, చలాకిచంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణతేజ త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం:
మోహిత్ రెహమానిక్ ;  పాట‌లు : పూర్ణచారి;  పి. ఆర్. ఓ. :  జికె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు ; నిర్మాత : రవి పోలిశెట్టి; సమర్పణ : వి.జయశంకర్ ; రచన –
దర్శకత్వం : సంజయ్ శేరి.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News