మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 13వ మూవీ #VS13, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 8గా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. విశ్వక్ ని ఫెరోషియస్ పోలీసుగా ప్రజెంట్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13లో విశ్వక్ సేన్ హానెస్ట్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పోలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది.
ఈరోజు చిత్ర యూనిట్‌తో పాటు మరికొందరు ప్రత్యేక అతిధుల సమక్షంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు వశిష్ట క్లాప్ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ బ్యూటీ సంపద కూడా ఈ వేడుకకు హాజరైంది.
ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి టాప్-క్లాస్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తంగలన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.
నటీనటులు: విశ్వక్ సేన్, సంపద
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీధర్ గంటా
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
డీవోపీ: కిషోర్ కుమార్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…