మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు.
హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో ఆదరగొట్టె హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ కెవి దిట్ట, వీరి కొలాబరేషన్ యూనిక్ స్టొరీ లైన్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాంబో విశ్వక్ సేన్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని అనుదీప్ కెవి సిగ్నేచర్ హ్యూమర్‌తో బ్లెండ్ చేసి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కెవి అనుదీప్‌తో పాటు మోహన్ సతో కథను అందించారు.
#VS14 కి సంబధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేనున్నారు.
తారాగణం: విశ్వక్ సేన్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – కెవి అనుదీప్
కథ – కెవి అనుదీప్ & మోహన్ సతో
నిర్మాత – టిజి విశ్వ ప్రసాద్
బ్యానర్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సినిమాటోగ్రఫీ – సురేష్ సారంగం
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
పీఆర్వో – వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…