జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

Must Read

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించడంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది.

‘కన్నప్ప’ సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌కి అందించేందుకు విష్ణు మంచు రెడీ అయ్యారు. సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు విడుదల చేసిన రీ రిలీజ్ డేట్ పోస్టర్ వైరల్ అవుతోంది.

Latest News

ఎలైట్ క్రికెట్ లీగ్ లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగే ‘అనకాపల్లి’ ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం.. ఆగస్ట్ 7న భారీ ఎత్తున చిత్రం విడుదల

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు...

More News