ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ‘2కె లవర్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Must Read

ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ‘2కె లవర్స్’ (Soul of Love) పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు దైవ సన్నిధానం లో ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని తదితరులు ముఖ్య పాత్రలను పోషించబోతున్నారు. ఈ మూవీకి రసూల్ భాయ్ కథను అందించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం..

దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ .. ‘రసూల్ గారు అద్భుతమైన కథను ఇచ్చారు. తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా మూవీ ఉంటుంది. మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మణిశర్మ గారికి, తనికెళ్ల భరణి గారికి, వీఎన్ ఆదిత్య గారికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత బిచ్చు నాయక్ గారికి, రసూల్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ .. ‘ఈ రోజు మా ఎం.బి. ప్రొడక్షన్స్ హౌస్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. రసూల్ మంచి కథను అందించారు. రాజేష్ గారు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ యాసలో ఇది వరకు చూడని ప్రేమ కథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా ఉండబోతోంది. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లినా కూడా వెంటాడేలా మా సినిమాలోని కథ ఉంటుంది. అందరినీ హత్తుకునేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.

రచయిత రసూల్ మాట్లాడుతూ .. ‘‘ఎం.బి. ప్రొడక్షన్స్‌లో తెరకెక్కించబోతోన్న ఈ ‘2కె లవర్స్’ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం తీయబోతోన్న ఈ ప్రేమ కథను అందరూ ఆదరిస్తారు. ఇందులోని కథ అందరినీ వెంటాడుతుంది. మా చిత్రంలో ప్రేమ, రోదన, ఆవేదన, బంధాలు, అనుబంధాలు, హాస్యం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి’ అని అన్నారు.

హీరో మోహిత్ మాట్లాడుతూ .. ‘ఎంబి ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ ‘2కె లవర్స్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇదొక కొత్త ప్రేమ కథ. రెగ్యులర్ సినిమాల్లా మాత్రం ఉండదు. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ .. ‘ఎంబి ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ ‘2కె లవర్స్’లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. కథ విన్న వెంటనే ఏడ్చేశాను. మా సినిమాలో ఎమోషన్‌తో పాటుగా కామెడీ కూడా కావాల్సినంత ఉంటుంది’ అని అన్నారు.

నటుడు ప్రణీత్ మాట్లాడుతూ .. ‘‘2కె లవర్స్’ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

తారాగణం : మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని తదితరులు

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: రాజేష్ నాయుడు
నిర్మాత: బిచ్చు నాయక్
సంగీతం: మణిశర్మ
రచయిత: రసూల్ భాయ్
D.O.P: పవన్
కాస్ట్యూమ్స్: రిచితా రాయ్
డైరెక్షన్ టీమ్ : రబ్బానీ, బాల ప్రసాద్
Vfx : అజయ్
CG: ఆర్క్‌వర్క్స్ ,
PRO : పాల్ పవన్
మార్కెటింగ్ : వంశీ కృష్ణ (సినీ డిజిటల్)

Latest News

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ...

More News