నటుడు, నిర్మాత విష్ణు మంచు నేతృత్వంలోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్ ఫండ్ అయిన తరంగ వెంచర్స్‌లోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విల్ స్మిత్‌ని కీలక భాగస్వామిగా చేరడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. $50 మిలియన్ల ఫండ్, మరో $50 మిలియన్ల పొటెన్షియల్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నారు. మీడియా, వినోద రంగంలో ఆవిష్కరణలను పెంచడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది.
మారుతున్న సాంకేతికతలు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్‌చెయిన్, AR, VR, AI వంటి అధునాతన సాంకేతికత వంటి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో మద్దతు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తుంది.
ఈ తరంగ వెంచర్స్‌లో భారతీయ నటుడు, నిర్మాత, వ్యవస్థాపకుడు మంచు విష్ణు, దశాబ్దాల అనుభవం ఉన్న ఆర్థిక నిపుణురాలు అదిశ్రీ, రియల్ ఎస్టేట్ అండ్ పెన్షన్ ఫండ్స్‌లో కెనడియన్ పెట్టుబడిదారు ప్రద్యుమన్ ఝలా, భారతీయ మీడియాలో అనుభవజ్ఞుడైన వినయ్ మహేశ్వరి, హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, పెట్టుబడిదారుల సంబంధాలు మరియు ఫండ్ కార్యకలాపాలలో నిపుణులైన దేవేష్ చావ్లా, సతీష్ కటారియా భాగస్వాములుగా ఉండనున్నారు.
భారతదేశం, డెలావేర్‌లో రిజిస్టర్ చేయబడిన ఈ ఫండ్ వినోద పరిశ్రమలో స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతును మాత్రమే కాకుండా వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది. ‘ఈ ఫండ్ మీడియా, వినోదం భవిష్యత్తును పునర్నిర్మించడానికి ఒక ముఖ్యమైన అడుగు’ అని విష్ణు మంచు చెప్పారు. సృజనాత్మకతను సాంకేతికతతో కలపడమే దీని ప్రాముఖ్యత అని చెప్పారు. వచ్చే వారం ప్రత్యేకమైన ఇన్వెస్టర్ బ్రీఫింగ్ ఫండ్ ప్రారంభానికి వేదికను ఏర్పాటు చేస్తున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…