టాలీవుడ్

విరాన్ ముత్తంశెట్టి ‘గిల్ట్’ టైటిల్ పోస్టర్ విడుదల

ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కాన్సెప్ట్‌లే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా కొత్త చిత్రం రాబోతోంది. ఇప్పటికే విరాన్ ముత్తంశెట్టి పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా పురుషోత్తముడు చిత్రంతో మెప్పించారు.

విరాన్ ముత్తం శెట్టి హీరోగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కనున్న ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోంది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ మీద లక్ష్మీ సునీల, డా. పార్థసారథి రెడ్డి, ఎ. శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా P శ్రీనివాస్, D శ్రీనివాస్ (వాసు) వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. గిల్ట్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్‌తోనే సినిమా మీద అందరి దృష్టి పడేలా మేకర్లు ప్లాన్ చేశారు.

నటీనటులు : విరాన్ ముత్తంశెట్టి తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ : శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్
నిర్మాతలు : డా. పార్థసారథి రెడ్డి, లక్ష్మీ సునీల, ఎ. శివ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 😛 శ్రీనివాస్, D శ్రీనివాస్ (వాసు )
దర్శకుడు : చలపతి పువ్వల
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్
సంగీత దర్శకుడు : మహావీర్
ఫైట్స్: నందు మాస్టర్
రచయిత : జి. రామకృష్ణ
కెమెరామెన్ : కిషోర్ బోయిడపు
పీఆర్వో : సాయి సతీష్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago