వరుణ్ సందేశ్ ‘విరాజి’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల

Must Read

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. అయితే ఈరోజు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ‘కొత్త బంగారు లోకం’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విరాజి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ “వరుణ్ సందేశ్ నా మొదటి సినిమా కొత్త బంగారు లోకం లో హీరో గా నటించాడు. ఇప్పుడే విరాజి సినిమా ట్రైలర్ చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. థ్రిల్లింగ్ గా అనిపించింది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి, రిచ్ గా ఉంది సినిమా. సినిమా టైటిల్, వరుణ్ సందేశ్ గెట్ అప్ కూడా మరియు సినిమా కథ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కి సూపర్ హిట్ పక్కాగా అనిపిస్తుంది. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల గారికి నా అభినందనలు.

వరుణ్ సందేశ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ విరాజి చిత్రం ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరు చూసి సూపర్ హిట్ చేయాలి” అని కోరుకున్నారు

VIRAAJI Movie Trailer ll Varun Sandesh ll Adhyanth Harsha ll Mahendra Nath Kondla

సినిమా పేరు: విరాజి

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు…

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పి ఆర్ ఓ: పవన్ పాల్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
వి ఎఫ్ ఎక్స్ : అఖిల్
పోస్టర్ డిజైన్స్: జి.దినేష్, గణేష్ రత్నం
స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం
డిజిటల్ పి ఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్
ఆడియో ఆన్: శబరి మ్యూజిక్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News