చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “తంగలాన్” ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో “తంగలాన్” స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చిన “తంగలాన్” చియాన్ విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ ను దాటింది. నెట్ ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందనుంది.
“తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.
నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
ఆర్ట్ – ఎస్ ఎస్ మూర్తి
ఎడిటింగ్ – ఆర్కే సెల్వ
స్టంట్స్ – స్టన్నర్ సామ్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం – పా రంజిత్
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు…
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆలియా భట్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో…
"కుమారి 21ఎఫ్, ఈడో రకం - ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్" వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్…
కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్…
గ్రేట్ యాక్టర్ శివాజీకి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డుని ప్రకటించింది. తాజాగా గద్దర్ అవార్డుల లిస్ట్‌ని ప్రభుత్వం…