వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్, మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకునన్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కొలాబరేట్ అవుతున్నారు. ఈ చిత్రానికి #Chiyaan63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు, శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3 గా నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, ఈ కొలాబరేషన్ అశ్విన్ క్రియేటివిటీ, విక్రమ్ పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ బ్లెండ్ చేసి మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
మడోన్ అశ్విన్ విక్రమ్ కు సరిపోయే సబ్జెక్ట్ తో సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది.
నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ..“దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్ సర్‌తో కలిసి మా ప్రొడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వుంది. అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనకు ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన నటుడితో చేతులు కలపడం మాకు గౌరవం. ఈ చిత్రానికి మండేలా, మావీరన్‌లను అందించిన అత్యుత్తమ డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రొడక్షన్ హౌస్‌గా, మేము రెండవసారి మడోన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మేమంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే చిత్రాన్ని అందించబోతున్నాం’ అన్నారు
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: చియాన్ విక్రమ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మడోన్ అశ్విన్
నిర్మాత: అరుణ్ విశ్వ
బ్యానర్: శాంతి టాకీస్
పీఆర్వో: వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…