నరేష్ అగస్త్య ‘వికటకవి’ ZEE5లో న‌వంబ‌ర్ 28న తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘వికటకవి’

Must Read

  • తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్

వైవిధ్యమైన కంటెంట్‌ను ఆస్వాదించాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ కథలను అందించడంలో ముందుంటోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఈ మాధ్య‌మం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ZEE5 ‘విక‌ట‌క‌వి’ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం.

హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కార‌ణాల‌తో అమరగిరి ప్రాంతంలోని స‌మ‌స్య‌ను గుర్తించ‌టానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. త‌న తెలివి తేట‌ల‌తో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమ‌రిగిరి ప్రాంతంతో రామ‌కృష్ణ‌కు ఉన్న అనుబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ZEE5 గురించి…

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Latest News

“Vikkatakavi” to stream on ZEE5 from 28th November

ZEE5 stands out as the go-to OTT platform offering unique stories. Their latest web series Vikathakavi is set to...

More News