ఉషాపరిణయం అందర్నిఆకట్టుకోవడం ఆనందంగా వుంది కె.విజయ్‌భాస్కర్‌

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా రూపొందిన మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఉషా ప‌రిణ‌యం ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్‌ మాట్లాడుతూ ‘చాలా రోజుల తరువాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా వుంది. నువ్వు నాకు నచ్చావ్‌ తరహాలో వినోదంతో పాటు నువ్వేకావాలి లాంటి టీనేజ్‌ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో వుందని అందరూ అంటున్నారు.

చిత్రాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మౌత్‌టాక్‌తో ఇది మరింత మందికి చేరువ అవుతుందని నమ్మకం వుంది. కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వస్తాయి. ఈచిత్రంతో హీరో, హీరోయిన్లకు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది’ అన్నారు. హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ సినిమా చూసిన అందరూ నా నటన, డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఈ రోజు ఫలితం చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. హీరోయిన్‌ తాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుండి చాలా పాజిటివ్‌ స్పందన వచ్చింది. ఓ మంచి చిత్రంలో హీరోయిన్‌గా నటించినందుకు సంతోషంగా వుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌భాస్కర్‌ గారికి థ్యాంక్స్’ అన్నారు. సినిమా చూసిన తరువాత చాలా రోజుల తరువాత మంచి సంగీతంతో కూడిన పాటలు చూశామని ఎమోషన్‌గా చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా వుంది. ఈచిత్రంలో ప్రతి పాటకు చక్కని సాహిత్యం, ట్యూన్స్‌ కుదిరాయి. నా కెరీర్‌లో ఇదొక మరుపురాని చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ తెలిపారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago