అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన ఐందామ్ వేదం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ఎల్. నాగరాజన్ తెరకెక్కించారు. ఈ మూవీలో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఐందామ్ వేదం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ‘వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు సూర్యుడ్ని చూసే విధంగా ఒకే వరుసలో ఉంటాయట.. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది’, ‘నాలుగు వేదాలు ఉన్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతోంది’ అంటూ సాగిన ఈ ట్రైలర్‌లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది
మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియ ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి నాగ ఈ ‘ఐందామ్ వేదం’ను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, ఇచ్చిన ఆర్ఆర్, భయపెట్టేలా చేసిన కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ‘ఐందామ్ వేదం’ జీ5 ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఓటీటీలోకి అక్టోబర్ 25న రాబోతోంది. అందరికీ తెలిసిన నాలుగు వేదాలు కాకుండా.. ఐదో వేదాన్ని జీ5 అందరికీ చూపించబోతోండటం ఆసక్తికరంగా ఉంది.
నటీనటులు: సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: అభిరామి మీడియా వర్క్స్
నిర్మాతలు: అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్
దర్శకుడు :ఎల్. నాగరాజన్
కెమెరామెన్ :శ్రీనివాసన్ దేవరాజన్
ప్రొడక్షన్ మేనేజర్ :పి.సోమసుందరం
కాస్టింగ్ డైరెక్టర్ :బి. మనోజ్ కృష్ణ
సంగీత దర్శకుడు :రేవా
ఎడిటర్ : రెజీష్. ఎం.ఆర్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…