టఫ్ బాక్సాఫీస్ కాంపిటేషన్ లో సైతం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటున్న విజయ్ దేవరకొండ “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సినిమా వసూళ్లపై ఇతర మూవీస్ ఎఫెక్ట్ పడుతోంది. కింగ్డమ్ ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ అయి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబట్టగా, ఆ తర్వాత వచ్చిన మహావతార్ నరసింహా కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తీవ్రమైన పోటీ మధ్య రిలీజైన కింగ్డమ్ సినిమా విజయ్ స్టార్ పవర్ తో గురువారం, శుక్రవారం మంచి వసూళ్లు సాధించింది. యూఎస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఫస్ట్ డే ఈ సినిమాకు 39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కడం విశేషం. హరి హర వీరమల్లు, వార్ 2, కూలీ మూవీస్ నుంచి కింగ్డమ్ కు పోటీని కింగ్డమ్ మేకర్స్ ఊహించారు గానీ అనూహ్యంగా మహావతార్ నరసింహా మూవీ సూపర్ హిట్ కావడం 20 కోట్ల రూపాయలకు పైగాషేర్ కలెక్ట్ చేయడం ఊహించలేదు. కింగ్డమ్ కలెక్షన్స్ ను మహావతార్ నరసింహా డివైడ్ చేస్తోంది. గతంలో నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన డాకూ మహారాజ్, గుంటూరు కారం, ఇప్పుడు కింగ్డమ్ మూవీస్ తీవ్రమైన బాక్సాఫీస్ పోటీలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టాయి. కింగ్డమ్ స్టైలిష్ హిట్ గా నిలిచి ఇంత కాంపిటేషన్ లోనూ అతి తక్కువ టైమ్ లో మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ముఖ్యం గా విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ కారణంగా తమిళ్, మలయాళం లో ఇప్పటికే ఈ సినిమా ప్రాఫిట్స్ లో కి రావడం విశేషం

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago