“విడుదల 2” చిత్రాన్ని ఫాన్సీ రేటుకు దక్కించుకున్న శ్రీ వేధక్షర మూవీస్ చింతపల్లి రామారావు

తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం విడుదల. విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా అతి త్వరలో “విడుదల2” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఫాన్సీ రేట్ తో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ”విడుదల 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫో టైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తో కలిసి ఈ చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు.

మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్ని మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతూ, ఈ చిత్రం డెఫినెట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను .ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం
అని అన్నారు
విజయ సేతుపతి, సూరి, మంజుల వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవాని శ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: వేల్ రాజ్, సంగీతం: ఇళయరాజా,
దర్శకత్వం: వెట్రీ మారన్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago