‘జైలర్’  హుకుం సాంగ్ ని లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్, సన్ పిక్చర్స్, ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘జైలర్‌’తో ఫుల్ మీల్ ట్రీట్‌ను అందించబోతున్నారు.యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సెకండ్ సింగిల్ ‘హుకుం’ పాటని మేకర్స్ ను విడుదల చేసారు. తెలుగు వెర్షన్ పాటను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు.

ప్రేక్షకులని ప్రతిసారి అలరించే అనిరుధ్ ‘హుకుం ‘పాట కోసం థంపింగ్ ట్యూన్‌ చేశారు. బీట్‌లు వోకల్స్ హైలీ ఎనర్జిటిక్ గా వున్నాయి. ఈ పాటకు భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించారు. రజనీకాంత్ పూర్తి మాస్ అవతార్‌లో తుపాకులు పేల్చుతూ కనిపించారు. రజనీకాంత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్,  డైలాగ్ డెలివరీ ఖచ్చితంగా అభిమానులను ఉర్రూతలూగిస్తాయి.

కావాలయ్య పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హుకుం పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది. బిగ్ స్క్రీన్స్ పై పూర్తి విజువల్స్‌తో పాటను చూసినప్పుడు డబుల్ ఇంపాక్ట్ ని ఇస్తుంది.

జైలర్‌లో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తుండగా మోహన్‌లాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

విజయ్ కార్తీక్ కన్నన్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఆర్ నిర్మల్ ఎడిటర్. జైలర్ ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago