హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మిస్టేక్’ ట్రైలర్ విడుదల..

పలు సినిమాల్లో నటుడిగా మెప్పించి ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ASP బ్యానర్ పై మిస్టేక్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. 100కి పైగా సినిమాల్లో మనందరినీ మెప్పించిన హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ ప్రముఖులు VJ సన్నీ, మానస్, సోహైల్, సింగర్ రేవంత్, నటుడు బెనర్జీ, లోహిత్ కుమార్, విక్రమాదిత్య, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్, లగడపాటి శ్రీధర్, చైతన్యకృష్ణ.. పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు విచ్చేశారు. హీరో శ్రీకాంత్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మిస్టేక్ ట్రైలర్ అందర్నీ మెప్పించింది. అభినవ్ సర్దార్ సిక్స్ ప్యాక్ తో చేసిన యాక్షన్ సీన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రముఖులంతా, చిత్రయూనిట్ తమ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ ని షేర్ చేసుకున్నారు. కొంతమంది సరదాగా మాట్లాడి ఎంటర్టైన్ చేశారు. ఈవెంట్ కి విచ్చేసిన ప్రముఖులు చిత్రయూనిట్ ని అభినందించి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. మిస్టేక్ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.

మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సర్దార్ నాకు తమ్ముడు లాంటోడు, మంచి ఫ్రెండ్. ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. చాలా రంగాల్లో సర్దార్ విజయం సాధించాడు. సినిమాల్లో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా వచ్చాడు. ఈ సినిమా మీద సర్దార్ కి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. విలన్ గా నాకు పోటీ వచ్చిన పర్లేదు. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ అల్ ది బెస్ట్ అని తెలిపారు.

అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. నేనొక చిన్న యాక్టర్ ని. నా కోసం ఎక్కడెక్కడ్నుంచో వచ్చారు. నా కోసం ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది ఒక చిన్న సినిమా. మన అందరికి మెగాస్టార్ చాలా ఇష్టం, ఆయన వరకు మనం వెళ్లకపోవచ్చు కానీ నా మెగాస్టార్ మాత్రం మీరే శ్రీకాంత్ అన్న. ఏ టైంలో కాల్ చేసినా డైరెక్ట్ లిఫ్ట్ చేసి మాట్లాడాతారు. ఎంత ఎదిగినా ఇలా సింపుల్ గానే ఉంటారు. శ్రీకాంత అన్న అడగ్గానే ఈవెంట్ కి వచ్చారు. నాకు సొంత అన్నలాగా ఉంటారు. ఇండస్ట్రీలో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా ఒక మిస్టేక్ తోనే మొదలుపెట్టాం. నేనెప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా పర్ఫెక్షన్ తోనే అన్ని చేస్తాను. 2010 నుంచి సినిమాలు చేస్తున్నాను. నేను ఎన్ని బిజినెస్ లు చేసినా, సినిమాలు, సోషల్ సర్వీస్ చేసినా చాలా క్లారిటీగా, 100 శాతం చేస్తాను. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమా చేసేటప్పుడు భుజానికి గాయం అయింది. ఇప్పటికి కూడా ఇంకా జిమ్ కి వెళ్లట్లేదు ఆ గాయం వల్ల. కెమెరా మెన్ హరి, సంగీత దర్శకుడు మణి జిన్నా, ఈ సినిమాకి పని చేసినా వాళ్లందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

డైరెక్టర్ సన్నీ అలియాస్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ.. 2021 లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా చేశాం. చాలా మంది ఈ సినిమాకు కష్టపడ్డాం. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రానుంది. శ్రీకాంత్ అన్న గెస్ట్ గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మళ్ళీ మాట్లాడతాను అని సినిమాకి పని చేసిన వాళ్లందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు.

ప్రముఖ సంగీత దర్శకులు RP పట్నాయక్ గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. డైరెక్టర్ భరత్ క్రియేటివిటీ బాగుంటుంది. పాట చాలా బాగుంది. సర్దార్ కి ఎప్పట్నుంచో ఒక హిట్ బాకీ ఉంది. ఈ సినిమాతో అది వచ్చేస్తుంది. సర్దార్ చాలా నిజాయితీగా కష్టపడతాడు కాబట్టి ఆ సక్సెస్ రావాలి. సంగీతం అందించిన మణి జిన్నా బాగా ఇచ్చారు అని అభినందించారు.

నటుడు లోహిత్ మాట్లాడుతూ.. మా అందరికి భరత్ అంటే ఇష్టం. నాకు గట్టి నమ్మకం కొరియోగ్రాఫర్స్ పెద్ద డైరెక్టర్స్ అవుతారు. ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్.. ఇలా చాలా మందిని చూశాం. త్వరలో సన్నీ కూడా వాళ్ళల్లో ఒకడిగా ఉంటాడు. నా ఫ్రెండ్ అభినవ్ సర్దార్ కష్టపడే తత్వం, చాలా దగ్గర్నుంచి చూస్తాను అతన్ని. ఒక 10 ఏళ్ళ జర్నీ మాది. చాలా సినిమాలు చేశాడు. మిస్టేక్ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి బాంబే నుంచి విలన్స్ తెచ్చుకొనవసరం లేదు. సర్దార్ విలన్ గా ఉండాలని అందరూ అనుకుంటారు అని తెలిపారు.

నటుడు విక్రమాదిత్య మాట్లాడుతూ.. S ఫర్ సర్దార్, S ఫర్ సన్నీ, S ఫర్ సక్సెస్. సర్దార్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఈ మిస్టేక్ సినిమాతో గట్టిగా కొడతాడు అని తెలిపారు.

బిగ్‌బాస్ RJ సూర్య మాట్లాడుతూ.. సర్దార్ అన్న సిక్స్ ప్యాక్ కోసం చాలా డెడికేషన్ పెట్టారు. అన్నని చూస్తుంటేనే తెలిసిపోతుంది. డైరెక్టర్ భరత్ కి, సర్దార్ అన్నకి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

సింగర్ అరుణ్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ మణి జిన్నా గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. డైరెక్టర్ భరత్ అన్న, మేము క్రికెట్ మేట్స్. ఎప్పట్నుంచో పరిచయం ఉంది. నేను డాక్టర్ చదివి ఇలా సింగర్ గా మారాను. ఈ ప్రొఫెషన్ తో చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు.

లిరిసిస్ట్ శ్రీరామ్ మనస్వి మాట్లాడుతూ.. ఈ రోజు నా డ్రీమ్ నెరవేరింది. సర్దార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన యంగ్ ఏజ్ లో ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చిన RP పట్నాయక్ గారు ఇక్కడికి వచ్చి పాట లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. టీం అందరికి అల్ ది బెస్ట్ అని అన్నారు.

లిరిసిస్ట్ విరించి మాట్లాడుతూ.. నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో అన్నే నాన్ను పిలిచి ఈ సినిమాలో లిరిసిస్ట్ గా అవకాశం ఇచ్చారు. ఒకప్పుడు ఇదే హోటల్ లో చాలా సార్లు కేటరింగ్ చేయడానికి వచ్చాను. అలాంటిది ఇవాళ ఇక్కడ నిల్చున్నాను. చాలా ఆనందంగా ఉంది. మా పాటని ఇంతలా ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. కొత్తవాడిని అయినా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భరత్ గారికి, నిర్మాత సర్దార్ గారికి చాలా థ్యాంక్స్ అని తెలిపాడు.

బిగ్‌బాస్ VJ సన్నీ మాట్లాడుతూ.. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమైంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ టీం చేసిన ఓ క్రియేటివ్ వీడియో చూశాను, చాలా బాగుంది. ఇక సినిమాలో మరింత క్రియేటివిటీ ఉంటుంది అని నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో డైరెక్టర్ భరత్, సర్దార్ అన్నతో సినిమా చేసే అవకాశం రావాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.

బిగ్‌బాస్ సోహైల్ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా సినిమా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇవాళ చాలా మంది సర్దార్ అన్న కోసమే వచ్చారు. ఆస్తులు సంపాదించుకోకపోయినా మనుషులని సంపాదించుకోవాలి. అన్న చాలా మందిని సంపాదించుకున్నారు. లైఫ్ లో మన కోసం ఓ పది మంది వచ్చినప్పుడే సక్సెస్ అయినట్టు. సర్దార్ అన్న ఆల్రెడీ ఆ సక్సెస్ లో ఉన్నారు అని అన్నారు.

బిగ్‌బాస్ మానస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి నేను ఆడిషన్ ఇచ్చాను బిగ్ బాస్ కి వెళ్లే ముందు. కానీ వర్కౌట్ అవ్వలేదు. కొరియోగ్రాఫర్స్ డైరెక్టర్స్ గా మారితే చాలా క్లారిటీతో ఉంటారు. భరత్ మంచి సక్సెస్ సాధిస్తారు. సర్దార్ అన్నకి, చిత్ర యూనిట్ అందరికి అల్ ది బెస్ట్ అని అన్నారు.

సింగర్ రేవంత్ మాట్లాడుతూ.. మణి జిన్నా గారు మంచి సంగీతం ఇచ్చారు. డైరెక్టర్ భరత్ ఈ సినిమా కోసం అన్ని వదిలేసి కష్టపడ్డాడు. అతని కష్టం కోసం అయినా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని అన్నాడు.

నటుడు శ్రీధర్, శ్రీనివాస్, చైతన్య కృష్ణ, షాని, నటి గరీమా, తానియా, సౌమ్య మాట్లాడుతూ.. సర్దార్ కోసం ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. చిత్ర యూనిట్ అందరికి అభినందనలు అని తెలిపారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్, నటుడు బెనర్జీ, ఇన్ కం ట్యాక్స్ కమీషనర్ జీవన్ మాట్లాడుతూ.. సర్దార్ చాలా మంచి స్నేహితుడు, మంచి బిజినెస్ మెన్, చాలా కష్టపడతాడు. ఈ మిస్టేక్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, చిత్రయూనిట్ కి అభినందనలు తెలిపారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

22 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago