వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ ర‌మేష్ రూపొందుతున్న

వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స‌, ప్రెస్టీజియ‌స్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మిస్టీరియ‌స్ థ్రిల్ల‌ర్ ‘శివోహం’

రాక్ష‌సుడు వంటి క్రైమ్ థ్రిల్ల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స‌. ఎప్పటిక‌ప్పుడు విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న నెక్ట్స్ మూవీ ‘శివోహం’తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌టానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. దానికి సంబంధించిన వివరాల‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై డిఫ‌రెంట్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. 

‘మిస్టీరియ‌స్ సాగా గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎవ‌రికీ అంతుచిక్క‌ని నిధి, ఓ డెవిల్‌కి మ‌ధ్య న‌డిచే యుద్ధం’ అని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగించే పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ‘శివోహం’ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే గుడి ద్వారం మూసి వేయ‌డింది. దాని ముందు ఓ త్రిశూలం క‌నిపిస్తోంది. అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. ఇది ఆడియెన్స్‌లో తెలియ‌ని ఓ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. క‌చ్చితంగా ఎవ‌రికీ తెలియ‌ని ర‌హస్య‌మేదో ఉంద‌నే ఆలోచ‌న క‌లుగుతుంది. 

డైరెక్టర్ ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స‌గారు ద‌క్షిణాది అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన స్టూడియోగ్రీన్ వంటి ప్రొడ‌క్ష‌న్ హౌస్‌తో క‌లిసి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. స్టార్స్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్‌, మంచి క్వాలిటీ మూవీస్‌ను చేయ‌టంలో స్టూడియో గ్రీన్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఇదే సంస్థ నుంచి ఓ మిస్టీరియ‌స్ థ్రిల్ల‌ర్ రూపొందుతుండ‌టం అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతోంది. 

కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ డెటాకె సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న‘శివోహం’ చిత్రానికి సంబంధించి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago