బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’లో అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్సులు

*జవాన్ కోసం వర్క్ చేసిన పవర్ హౌసెస్ లాంటి 6 గురు యాకన్ డైరెక్టర్స్ 

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘జవాన్’. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి  యాకన్ కొరియోగ్రాఫర్స్ ‘జవాన్’ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైన పేర్కొన్న యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రపంచంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు వర్క్ చేశారు. జవాన్ లో భారీ యాకన్ సన్నివేశాలున్నాయి. ఇవన్నీ కథలో భాగంగా ఉంటూనే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి. సాధారణంగా ఒకరు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తేనే ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది ఏకంగా 6గురు అత్యుత్తమ యాక్షన్ మాస్టర్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. 

ఇంటర్నేషనల్ యాక్షన్ వరల్డ్ లో స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి వారికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్లనే జవాన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుపరుస్తున్నాయి. ది ఫాస్ట అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, టీనేజ్ మ్యూటెండ్ నింజా  టర్టల్స్ వంటి సినిమాలకు భారీ ఫైట్స్ ను డిజైన్ చేశారు స్పైరో రజటోస్. ఆయన ఇంతకు ముందు షారూఖ్ ఖాన్ రా వన్ సినిమాకు కూడా వర్క్ చేశారు. ఆ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్, యాక్షన్ సన్నివేశాలను అందరూ అప్రిషియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

యాన్నిక్ బెన్ విషయానికి వస్తే ఆయన పార్క్ అవర్ ట్యూటర్ వంటి హాలీవుడ్ మూవీకి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. అలాగే ట్రాన్స్ పోర్టర్ 3, డంక్రిక్, ఇన్ సెప్షన్ వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు రాయీస్, టైగర్ జిందా హై, అత్తారింటికి దారేది, నేనొక్కడినే వంటి సినిమాలకు ఆయన వర్క్ చేశారు. క్రెయిక్ మాక్రె విషయానికి వస్తే ఆయన మ్యాడ్ మ్యాక్స్:ఫ్యూరీ రోడ్, అవెంజర్స్, ఏజ్ ఆఫ్ ఉల్ట్రాన్ వంటి సినిమాలలోని యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసి మెప్పించారు. ఇక మన సినిమాలలో వార్ సినిమాకు ఈయన కంపోజ్ చేసిన ఫైట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. 

కెచా ఖంఫాడీ ఇంగ్లీష్ స్టంట్ డైరెక్టర్ ఈయన హాలీవుడ్ సినిమాలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, తమిళ, తెలుఉ చిత్రాలకు కూడా వర్క్ చేశారు. తుపాకీ, బాహుబలి 2, భాగి 2 వంటి సినిమాలకు వర్క్ చేశారు. బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలో ఈయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సునీల్ రోడ్రిగ్స్ షేర్షా, సూర్యవంశీ, పఠాన్ వంటి సినిమాకు వావ్ అనిపించేలా యాక్షన్స్ ను డిజైన్ చేశారు. 

అనల్ అరసు కంపోజ్ చేసే యాక్షన్ సన్నివేశాల గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుల్తాన్, ఖైది, కిక్ వంటి పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు ఆయన ఫైట్స్ కంపోజ్ చేశారు

. 

‘షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

12 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago