హీరో వెంకట్ మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’ మే 8న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Must Read

OG,శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’.

రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.సహా నిర్మాతలు గా Dr దిక్కల laxman రావు
Dr Praveen reddy ఉన్నారు.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

‘ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది’ చిత్ర నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రంలో హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా ఆనంద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ ఎడిటర్.

తారాగణం: వెంకట్, శ్రీహరి ,హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ, సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ , వేద్విక,చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ. దిల్ రమేష్, దొరబాబు

సాంకేతిక సిబ్బంది:

కథ , మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం: రాజ్ తాళ్లూరి
బ్యానర్ : విఆర్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మని జీన్న
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : G C క్రిష్
డిఓపి: ఆనంద్
ఎడిటర్: ఉప్పు మారుతీ
ప్రొడక్షన్ డిజైనర్: ఓంకార్ కడియం
యాక్షన్ కొరియోగ్రఫీ: శివ రాజ్
లిరిసిస్ట్: భాను ప్రకాష్,రంజిత్ కుమార్ రిక్కీ విశ్వ వేమూరి, విరుంచి పుట్లా
Vfx సూపర్‌వైజర్: నాగరాజు
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: నాగరాజు
స్టిల్స్: పంతులు
మేకప్ చీఫ్: నాయుడు
పీఆర్వో: తేజస్వి సజ్జ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News