‘వీరాంజనేయులు విహారయాత్ర’ మనసులో నిలిచిపోయే సినిమా

నవరసరాయ డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీం కాబోతోంది. ఈ రోజు ప్రెస్ ప్రిమియర్ స్క్రీన్ చేశారు మేకర్స్. అనంతరం మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో డా. నరేష్ వికె మాట్లాడుతూ..ఉషాకిరణ్ మూవీస్ కి శ్రీవారికి ప్రేమ లేఖ ఎంత పెద్ద సినిమానో ఈటీవీ విన్ కి ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అంత పెద్ద సినిమా అవుతుందని మొన్న ప్రెస్ మీట్ లో అన్నాను. అంత పెద్ద సినిమా కాబట్టి ఈ మాట నమ్మకంగా చెప్పగలిగాను. రిలీజైన తర్వాత ఈటీవీ విన్ కి ఇది హయ్యస్ట్ గ్రాసర్ అవుతుంది. ఇందులో ప్రేక్షకులు ఊహించని కామెడీ, డైలాగ్స్ పంచస్ వుంటాయి. దీంతో పాటు ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది. సామజవరగమనా తర్వాత మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చుస్తున్నారు ఆడియన్స్. వీరాంజనేయులు విహారయాత్ర ఆ ఆకలి తీర్చినట్లుగా వుంటుంది.  డైరక్టర్ అనురాగ్ ఈ సినిమాతో తన స్టాంప్ వేసుకుంటాడు, అద్భుతమైన విజువల్స్ వుంటాయి. నిర్మాతలు చాలా అద్భుతంగా నిర్మించారు. అందరికీ థాంక్స్. టీజర్ వచ్చినప్పటినుంచి ఈ సినిమా వైరల్ అయ్యింది. మనసులో మిగిలిపోయే నిమా చేసినందుకు చాలా ఆనందంగా వుంది. నటుడిగా గొప్ప అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది’ అన్నారు.

యాక్టర్ రాగ్ మయూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసినప్పుడు మీ అందరికీ మీ జ్ఞాపకాలు, ఫ్యామిలీ బాండింగ్స్ గుర్తొచ్చాయనే అనుకుంటున్నాను. చాలా ఎమోషన్స్ తో కూడుకున్న సినిమా ఇది. ఆ ఎమోషన్ ని మీరు ఫీలైయ్యారని భావిస్తున్నాను. నరేష్ గారు నా ఫేవరేట్. ఆయనతో నాకు మంచి సీన్స్ వున్నాయి. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా డైరెక్టర్ చాలా మంచి ఎమోషనల్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆగస్ట్ 14న సినిమా స్ట్రీమ్ అవుతోంది. తప్పకుండా చూడండి. ఈ ఉషా కిరణాలు పాట ఎంత బావుటుందో ఈ సినిమా అంత బావుంటుంది’ అన్నారు.

హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీకు మా మూవీ నచ్చిందని కోరుకుంటున్నాను. మంచి ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా ఇది. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆగస్ట్ 14న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ మీ ఫ్యామీలీస్ తో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

దర్శకుడు అనురాగ్ పాలుట్ల మాట్లాడుతూ.. మీడియాకి థాంక్ యూ. ఈ సినిమా మీరే ఫస్ట్ ఆడియన్స్. ప్రేమతో చేసిన సినిమా ఇది. ఇంతమంచి నటులు, టెక్నికల్ టీం దొరకడం నా అదృష్టం. ఐదు రాష్ట్రాలలో షూట్ చేశాం. 36 రోజుల్లో షూట్ ఫినిష్ చేశాం. ఇంత మంచి టీం వలనే ఇది పాజిబుల్ అయ్యింది. ఇదొక రిలేటబుల్ మూవీ. హై ఎమోషన్స్ వుంటాయి. మా చూసిన ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు’ అన్నారు. వెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.  

తారాగణం: నరేష్, శ్రీ లక్ష్మి, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, ప్రియదర్శిని, తరుణ, రవితేజ మహాదాస్యం
సాంకేతిక సిబ్బంది
నిర్మాత: బాపినీడు – బి, సుధీర్ ఈదర
రచన, దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల
డీవోపీ – అంకుర్ సి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -సతీష్ గుడే
ఎడిట్ – నరేష్ అడుప , హరి శంకర్ TN
సంగీతం -RH విక్రమ్
ప్రొడక్షన్ డిజైన్ – ఎల్లో డిజైన్ స్టూడియో

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

5 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

7 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago