జాన్ అబ్ర‌హం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘వేద’ ట్రైలర్ విడుదల

Must Read

  • ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతున్న సినిమా

జాన్ అబ్ర‌హం, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నిఖిల్ అద్వానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘వేద’. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘వేద’ అనే అమ్మాయి జీవితాన్ని తెలియ‌జేసే చిత్ర‌మే ఇది. న్యాయం కోసం ఆమె చేసే పోరాటాన్ని చూపించే సినిమా ఇది. మ‌నిషి అనుకుంటే సాధించ‌లేనిది ఏదీ లేదు అని చెప్పే ధృఢ‌మైన మ‌న‌స్త‌త్వాన్ని, ఎదురు తిరిగి పోరాడే త‌త్వాన్ని ఈ క‌థ ద్వారా తెలియ‌చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వేదకు తోడుగా, ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఓ మాజీ సైనికుడు నిల‌బ‌డ్డాడు. అత‌ని అండతో ఆమె ఎంత వ‌ర‌కు పోరాడిందో తెలియ‌జెప్పే క‌థాంశ‌మే ఈ మూవీ.

‘వేద’ ట్రైలర్ చూస్తుంటే రొమాలు నిక్కబొడిచేంత యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాలో హై యాక్ష‌న్, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం కోసం ప్ర‌మాద‌క‌ర‌మైన మార్గంలోకి వేద అనే అమ్మాయి ప్ర‌యాణాన్ని ప్రారంభించిన‌ప్పుడు ఆమెకు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను సినిమా మ‌న‌కు ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం పేరు విన‌గానే మ‌న‌కు ఆయ‌న పోషించిన అద్భుత‌మైన యాక్ష‌న్ పాత్ర‌లు గుర్తుకు వ‌స్తాయి. ఈ చిత్రంతో మ‌రోసారి ఆయ‌న త‌న‌దైన పంథాలో మెప్పించార‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ‘‘వేద’ లాంటి సినిమాలో భాగం కావటం నాకెంతో ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. మంచి వైపు నిల‌బ‌డాల‌ని, పోరాటం చేయాల‌నే అంద‌రినీ ప్రేరేపించే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కింది ’ అన్నారు జాన్ అబ్ర‌హం.

చిత్ర ద‌ర్శ‌కుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే కేవలం వినోదాన్ని అందించే మాధ్యమం మాత్రమే కాదు. మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని నేను నమ్ముతాను. రేపు వేద సినిమా చూసిన తర్వాత చాలా మంచి ప్రేక్ష‌కుల‌కు మ‌న‌సుల్లో గుర్తుండిపోతుంద‌ని గ‌ట్టిగా విశ్వ‌స్తున్నాను’’ అన్నారు.

ఉమేష్ కె.ఆర్‌.బ‌న్సాల్‌, సీబీఓ, జీస్టూడియోస్ మాట్లాడుతూ ‘‘వేద’ అనేది బలమైన పాత్రలతో కూడిన శక్తివంత‌మైన క‌థ‌. ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌కు హ‌త్తుకునే సినిమా అవుతుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్మెంట్ మ‌ధు బోజ్వానీ మాట్లాడుతూ ‘‘‘వేద’వంటి సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టం మా అంద‌రికీ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. సాధికారిత‌త‌ను తెలియ‌జేస్తూ స్ఫూర్తినింపేలా ఈ చిత్రాన్ని చేయ‌టం అనేది సినిమాపై మాకున్న ప్రేమ‌ను తెలియ‌జేస్తుంది. దీన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తుండ‌టం మాకెంతో గ‌ర్వ కార‌ణంగా అనిపిస్తోంది’’ అన్నారు.

జాన్ అబ్రహం, శర్వారి ప్రధాన పాత్రల్లో నటించిన ‘వేద’ చిత్రంలో అభిషేక్ బెనర్జీ కీలక పాత్రను పోషించారు. తమన్నా భాటియా స్పెషల్ అప్పియరెన్స్‌లో అల‌రించ‌బోతున్నారు. అసీమ్ అరోరా రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ తెర‌కెక్కించారు. జీ స్టూడియోస్‌, ఉమేష్ కె.ఆర్‌.బ‌న్సాల్, మోనిషా అద్వానీ, మ‌ధు బోజ్వానీ, జాన్ అబ్ర‌హం నిర్మించిన ఈ చిత్రానికి మీనాక్షి దాస్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జె.ఎ.ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణలో రూపొందిన ‘వేద’ సినిమా ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతుంది.

జీ స్టూడియోస్ గురించి:

ముంబైలో ఉండే జీ స్టూడియోస్ సంస్థ సినిమా నిర్మాణంతో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. వెబ్ సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్‌, టెలివిజ‌న్ కంటెంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌, నిర్మాణం, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూష‌న్ రంగాల్లో 2012 నుంచి ఈ సంస్థ త‌న ప్రత్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది. ది క‌శ్మీర్ ఫైల్స్‌, గ‌ద్ద‌ర్ 2, టువెల్త్ ఫెయిల్ వంటి చిత్రాల నిర్మాణంలో కీల‌క భూమిక పోషించిన జీ స్టూడియోస్ ప‌లు భాష‌ల్లో త‌న గ్లోబ‌ల్ ఆడియెన్స్ బ‌ల‌మైన క‌థ‌ల‌ను అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప‌లు ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లోనూ సినిమాల‌ను అందిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల‌ను అందుకున్న సైర‌త్‌, మామ్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌, మ‌ణిక‌ర్ణిక‌, మిసెస్ ఛ‌ట‌ర్జీ వెర్స‌స్ నార్వే, ది తాష్కెంట్ ఫైల్స్, కిస్మ‌త్ 2, బంగార్రాజు, తునివు, గాడ్ డే గాడ్ డే ఛా వంటి సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించి ప్రపంచ వ్యాప్తంగా జీ స్టూడియోస్ త‌న ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంది.

ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌:

2011, ముంబైలో ప్రారంభ‌మైన ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్మెంట్ అండ్ మోష‌న్ పిక్చ‌ర్స్ ఎల్ఎల్‌పి వైవిధ‌మ్యైన కంటెంట్‌ను అందించే సంస్థ‌గా రాణిస్తోంది. మోనీషా అద్వానీ , మ‌ధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ ఈ సంస్థ‌ను స్థాపించారు. ఈ సంస్థ సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మిస్తోంది. 12 ఏళ్లలో ఇప్ప‌టి వ‌ర‌కు 30 సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను ఈ సంస్థ నిర్మించింది. డీ డే, ఎయిర్ లిఫ్ట్‌, బాట్లా హౌస్‌, బాజార్, పి.ఒ.డ‌బ్ల్యు-బందీ యుద్ క, స‌త్య‌మేవ జ‌య‌తే, ముంబై డైరీస్‌, ది ఎంపైర్‌, అదూరా,, మిసెస్ ఛట‌ర్జీ వెర్సెస్ నార్వే వంటి సినిమాలో ఈ సంస్థ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్:

డిఫ‌రెంట్ సినిమాలు, ఎవ‌రూ చేయ‌లేని క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఆస‌క్తి చూపే సంస్థ‌లో జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్ ముందుంటుంది. 2008 ప్రారంభమైన ఈ సంస్థ విక్కీ డోన‌ర్ వంటి విల‌క్ష‌ణ‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రంతో ప్ర‌యాణాన్ని ప్రారంభించింది.ఈ సినిమా ప్ర‌ధాన క‌థాంశం వివాదాస్ప‌ద‌మైన‌ప్ప‌టికీ మేక‌ర్స్ ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. సినిమా బ‌డ్జెట్‌కంటే ప‌దిహేను రెట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే సినిమా ఆడియెన్స్‌కి ఎంత బాగా రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ద్రాస్ కేఫ్ వంటి కాంట్ర‌వ‌ర్సియ‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ను రూపొందించింది. మాజీ ప్ర‌ధాని శ్రీలంక సివిల్ వార్‌లో ఎలా భాగ‌మ‌య్యారు. దాని వ‌ల్ల ఎలాంటి పరిస్థితులు ఇక్క‌డ నెల‌కొన్నాయనే క‌థాంశంతో సినిమా రూపొందింది. సినిమా బ‌డ్జెట్ కంటే మూడు రెట్లు రాబ‌ట్టడ‌మే కాకుండా వివ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుందీ చిత్రం. అలాగే బాట్లా హౌస్, పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, ఎటాక్, ఫోర్స్ 2 వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News