రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ‘ఆయుధం వస్తోంది’.. ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’.. అనే డైలాగ్స్.. ట్రైలర్ చివర్లో గరుత్మంతుడి షాట్ అదిరిపోయాయి. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..
మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. ‘‘వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్‌లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్‌కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జిజు కెమెరా వర్క్, మణిశర్మ గారి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.
దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. ‘నిర్మాత గారికి ముందు ఓ రెండు కథలు చెప్పాను. అవి బాగానే ఉన్నాయని అన్నారు. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ కథను రాసుకున్నాను. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్ గారికి కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. మణిశర్మ గారికి కథ చెప్పాను. నచ్చితేనే చేయండి అని ఆయనతో అన్నాను. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మా సినిమా జూలై 10న రాబోతోంది. మూవీ చూసిన తర్వాత మణిశర్మ గారి పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. ఇది వన్ మెన్ షో. చివరి 45 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత త్రినాథ్ కేశవ మాట్లాడుతూ .. ‘‘వసుదేవసుతం’ మాకు తొలి చిత్రం. మా సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీ జూలై 10న రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

అంబికా వాణి మాట్లాడుతూ .. ‘‘వసుదేవసుతం’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు తెలుగు సరిగ్గా రాలేదు. నేను నేర్చుకుంటాను. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నాకు భాష రాలేదు అని ఎవ్వరూ నన్ను నిరుత్సాహ పర్చలేదు. అందరూ నాకు సపోర్ట్ చేశారు. మహేంద్రన్‌తో పని చేయడంతో సంతోషంగా ఉంది. మా సినిమా జూలై 10న రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అజయ్ సాయి మాస్టర్ మాట్లాడుతూ .. ‘‘వసుదేవసుతం’ సినిమాలో రెండు పాటల్ని కొరియోగ్రఫీ చేశాను. చాలా గ్యాప్ తరువాత మళ్లీ మణిశర్మ గారి పాటకు పని చేశాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. మాస్టర్ మహేంద్రన్ ఇందులో అద్భుతంగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తారాగణం : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: రెయిన్‌బో సినిమాస్
నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల
రచయిత & దర్శకుడు: వైకుంఠ్ బోను
సంగీతం: మణిశర్మ
DOP: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని
ఫైట్స్: రామకృష్ణ
పీఆర్వో : సాయి సతీష్

