జ్ఞానమ్మ కలివెల సమర్పణలో సంజన మూవీ మేకర్స్ పతకం పై విశ్వ, ఐశ్వర్య, అనూష హీరో హీరోయిన్లుగా వెంకటేష్ కలివెల ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంజన కలివెల నిర్మిస్తున్న “నా గురించి మీకు తెలియాలి” లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇటీవల ప్రారంభం అయినది. హీరో హీరోయిన్లు పై చిత్రికారంచిన ముహూర్తము సన్నివేశానికి క్లాప్ అమిత్ తివారి, కెమెరా స్విచ్ ఆన్ కుమారి సంజన, వెంకటేష్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా

దర్శకుడు వెంకటేష్ కలివెల మాట్లాడుతూ…. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో సాగె ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అని ఈచిత్రంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి, ముఖ్యంగా హీరో “నా గురించి నీకు తెలియాలి” అని చెప్పే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకె హైలైట్ అన్నారు.
నిర్మాత సంజన కలివెల మాట్లాడుతూ…. ఈనెల ఆఖరునుంచి భీమవరం, నర్సాపురం, అంతర్వేది పరిసర ప్రాంతాలలో ఏకాదాటి గా 34 రోజుల్లో షూటింగ్ పూర్తిచేస్తామన్నారు.
హీరో విశ్వ మాట్లాడుతూ… నా మొదటి సినిమాకె ఇలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న కథ రావటం అదృష్టంగా భావిస్తున్నాను.

హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ… ఈసినిమాలో నేను మీ పక్కింటి అమ్మాయిలా గ్లామర్ గా కనిపిస్తాను.
హీరోయిన్ అనూష మాట్లాడుతూ… ఈచిత్రంలో నేను ప్లే చేసే రోల్ అందరికి నచుతుందిన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ మాట్లాడుతూ… నాలుగు పాటలు రికార్డింగ్ పూర్తిచేశాం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి స్కోప్ ఉన్న చిత్రమని అన్నారు.
ఇంకా
అమిత్ తివారి, శుభలేఖ సుధాకర్, శివ ప్రసాద్,
ప్రసన్నకుమార్, జయరాజ్,
లతారెడ్డి నటిస్తున్న ఈచిత్రానికి
కెమెరా : దర్మేంద్ర దివి
మ్యూజిక్ : వర్ధన్
ఎడిటర్ : వేణు చౌదరి
కోరియోగ్రాఫర్ : శ్యామ్యులు
పి ఆర్ ఓ : ఆర్ కె చౌదరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రామ్ సాయి ఆకుల
ప్రొడ్యూసర్ : సంజన కలివెల j
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకటేష్ కలివెల.

