వియత్నాంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్#VT15 ప్రీ ప్రొడక్షన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోర్టర్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రానుంది. #VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వియత్నాంలో శరవేగంగా జరుగుతోంది. హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ‌తో పాటు నిర్మాతలు వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్‌ను చూస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం: వరుణ్ తేజ్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: తమన్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

10 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

10 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago