మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోర్టర్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రానుంది. #VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వియత్నాంలో శరవేగంగా జరుగుతోంది. హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీతో పాటు నిర్మాతలు వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్‌ను చూస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: వరుణ్ తేజ్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: తమన్
పీఆర్వో: వంశీ-శేఖర్
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…