వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “నా వైఫ్ మిస్సింగ్”. ఇటీవలే నయనం వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో ఒక చక్కటి ప్రేమ కథగా ఈ చిత్రం రానుంది. ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ (జబర్దస్త్) తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రఫీ చేయనున్న ఈ చిత్రానికి సాయి బాబు తలారి ఎడిటింగ్ చేస్తున్నారు. ఎన్నో చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఉమర్జీ అనురాధ ఈ చిత్ర కథను అందించగా శ్రీనివాస్ మండల స్క్రీన్ ప్లే రైటర్ గా ఉండగా ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం కావడం జరిగింది. ఆహా బృందం స్క్రిప్ట్ అందించగా సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ గారు మొదటి క్లాప్ కొట్టారు. నటుడు, నిర్మాత, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గౌరవనీయులు అశోక్ కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత నీలకంఠ గారు తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. కాగా నేటి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్స్, మిస్ అయిన వైఫ్ ఎవరు? అనే విషయాలు చిత్ర బృందం క్రమంగా విడుదల చేయనుంది.

నటీనటులు : వరుణ్ సందేశ్, ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ (జబర్దస్త్) తదితరులు.

సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : కొమర మీడియా వర్క్స్
నిర్మాత : శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు
దర్శకత్వం : స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ
కథ : ఉమర్జీ అనురాధ
స్క్రీన్ ప్లే రైటర్ : శ్రీనివాస్ మండల
డైలాగ్స్ : ఆదిత్య భార్గవ్
సినిమాటోగ్రఫీ : సతీష్ కుమార్ ఎన్ఎస్
ఎడిటర్ : సాయి బాబు తలారి
సంగీతం : సాయి కార్తీక్
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago