వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్”. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ మరియు ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది.

ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్‌గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వరుణ్ సందేశ్‌కు మరింత మంచి పేరు రావాలి. దర్శక, నిర్మాతలు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాలి. త్వరలోనే ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘మా టీజర్‌ను విడుదల చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నేను ఆయనతో చేసిన ప్రియతమా నీవచట కుశలమా అనే చిత్రం నాకు చాలా ఇష్టం. కానిస్టేబుల్ టీజర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ మూవీ టీజర్ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ‘మా మూవీ కానిస్టేబుల్ టీజర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా హీరో వరుణ్ సందేశ్, మా నిర్మాత బలగం జగదీష్ గారికి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. ‘ ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైన రోజు. మా అమ్మ గారు చనిపోయిన రోజు ఇది. ఈ రోజునే మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా టీజర్‌ను రిలీజ్ చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. మా హీరో వరుణ్ సందేశ్‌కు ఈ చిత్రం కమ్ బ్యాక్ అవుతుందని నా గట్టి నమ్మకం. మా సినిమా టీజర్‌ను చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు.

నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : జాగృతి మూవీ మేకర్స్
నిర్మాత : బలగం జగదీష్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్యన్ సుభాన్ SK.
సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య , సీహెచ్ రాజ్ కుమార్
కెమెరా; హజరత్ షేక్ (వలి)
సంగీతం :సుభాష్ ఆనంద్
ఎడిటింగ్: వర ప్రసాద్
B. G. M :గ్యాని
ఆర్ట్: వి. నాని, పండు
మాటలు :శ్రీనివాస్ తేజ
పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : పి లీలప్రసాద్, బి సాంబా రెడ్డి
మేకప్ :వెంకట్ రెడ్డి
కాస్ట్యూమ్ : సిరాజ్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

10 hours ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

10 hours ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

10 hours ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

10 hours ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

10 hours ago