హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై వరుణ్ సందేశ్ హీరోగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా “బ్లాక్ మెయిల్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత భరద్వాజ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా జెమిని సురేష్ గారి తల్లి ఎం వెంకట సుబ్బ లక్ష్మి గారు మొదటి షాట్ దర్శకత్వం చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు రక్షిత్ అట్లూరి, నటి శ్రీలు తదితరులు హాజరై తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మా సినిమాకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. మంచి ప్రాజెక్ట్ ను నమ్మి నా చేతిలో పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది మీడియా వారే, ఈ సినిమాకు మీ ప్రమోషన్ మంచి ఫలితం ఇస్తుంది” అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ… “మా సినిమా బ్లాక్ మెయిల్ చిత్ర ప్రారంభానికి వచ్చిన అందరికీ థాంక్స్. నాకు దర్శకులు చాలా కాలంగా పరిచయం. ఆయన ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్ తో సినిమా వస్తుంది అని అర్థం అయింది. నిర్మాతలకు, అతిథులకు నా థాంక్స్. త్వరలో చిత్ర షూటింగ్ మొదలవబోతుంది” అన్నారు.

నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ… “బ్లాక్ మెయిల్ చిత్రంతో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నారు. ముఖ్యంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిర్మాతగానే కాకుండా ప్రతి మార్గంలో ఆయన అండగా నిలిచారు. నేను హీరోగా తొలి చిత్రం దర్శకత్వం చేసిన శ్రీనివాస్ గారు ఈ చిత్రంలో మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా అనిపించింది. అలాగే నాతో కలిసి నటిస్తున్న ప్రతి నటీనటులకు, అతిథులకు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. నాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వరుణ్ సందేశ్ గారికి ప్రత్యేకంగా థాంక్స్. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది. మా సినిమాకు నా మీడియా సోదరులు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు మల్లిక్ తేజ మాట్లాడుతూ… “నన్ను బ్లాక్ మెయిల్ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నందుకు దర్శక నిర్మాతలకు, నటీనటులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ… “దర్శకుడు అడిగితే ఎంత రిస్క్ అయినా చేసే వ్యక్తి వరుణ్ సందేశ్. సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి జెమిని సురేష్. వారితో కలిసి నటించడం సంతోషకరం. ఈ సినిమాలో పని చేయడం నా సొంత కుటుంబంలోని వ్యక్తులతో పని చేసినట్లు ఉంటుంది, ఎందుకంటే అందరూ నా వాళ్ళే. బ్లాక్ మెయిల్ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. నిర్మాత అవినాష్ మనుషుల పట్ల ఎంతో ఆప్యాయతగా మెలిగే వ్యక్తి, ఆతిథ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో మంచి పాత్రలు, పాత్రధారులు ఉండబోతున్నారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ… “నాకు బ్లాక్ మెయిల్ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న అవినాష్ గారికి ఆల్ ద బెస్ట్. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. వరుణ్ సందేశ్ గారికి ఈ సినిమా మరో మంచి విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తోటి నటీనటులతో కలిసి నటించడం సంతోషకరం. సినిమా మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఏసిపి విద్యా సాగర్ గారు మాట్లాడుతూ… “మీడియా వారికి నమస్కారం. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై రానున్న బ్లాక్ మెయిల్ చిత్రం మంచి విజయం సాధించాలని, వరుణ్ సందేశ్ గారికి మరొక హ్యాపీ డేస్ లా, అలాగే జెమిని సురేష్ గారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందం వారికి మంచి పేరు రావాలని, నిర్మాత అవినాష్ గారికి కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత అవినాష్ మాట్లాడుతూ… “మా బ్లాక్ మెయిల్ చిత్ర ప్రారంభానికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి చాలా థాంక్స్. నేను ఈ సినిమా రంగంలోకి రావడానికి ఒక ముఖ్య కారణం 200 కుటుంబాలకు పని కలిగించవచ్చు అని. ఇంకొకటి తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను. నా సినిమాకు వచ్చే లాభాలలో 10% మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఇస్తాను అని మీడియా సమక్షంలో నటిస్తున్నాను” అంటూ ముగించారు.

తారాగణం : వరుణ్ సందేశ్, జెమినీ సురేష్, పృథ్వీ రాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు.

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి
నిర్మాత: అవినాష్ కూనపరెడ్డి
బ్యానర్: హనుమాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సినిమాటోగ్రఫీ: జీఎస్ చక్రవర్తి రెడ్డి
సంగీత దర్శకుడు : SV మల్లిక్ తేజ
ఎడిటర్: రాఘవేంద్ర రెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
స్టిల్స్ : శ్రీకాంత్ రెడ్డి
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్
మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

TFJA

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

3 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

3 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

3 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

5 days ago